విశాఖకు మరో వందేభారత్.. ప్రారంభించిన కేంద్ర మంత్రి

విశాఖకు మరో వందే భారత్ రైలు వచ్చేసింది. ఈ వందేభారత్ రైలు విశాఖ-దుర్గ్ నడవనుంది. ఈ వందేభారత్‌ను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు సోమవారం ప్రారంభించారు.

Update: 2024-09-16 14:52 GMT

విశాఖకు మరో వందే భారత్ రైలు వచ్చేసింది. ఈ వందేభారత్ రైలు విశాఖ-దుర్గ్ నడవనుంది. ఈ వందేభారత్‌ను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు సోమవారం ప్రారంభించారు. విశాఖ జంక్షన్‌లో ఉత్తరాది రాష్ట్రాలకు తొలి సెమీ హైస్పీడ్ రైలుగా ఈరోజు ప్రారంభించిన వందేభారత్ రైలు నిలిచింది. విశాఖ-దుర్గ్ మధ్య నడిచే వందేభారత్ రైలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కూడా కలుపుకుంటూ ప్రయాణించనుంది. ప్రస్తుతం విశాఖ నుంచి మూడు వందేభారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. వాటిలో రెండు విశాఖ-సికింద్రాబాద్ మధ్య, మరొకటి విశాఖ-భువనేశ్వర్ మధ్య వందేభారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే వందేభారత్ రైలు సేవలను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. దేశమంతటా అన్ని మార్గాల్లో వందేభారత్ రైళ్లను నడపాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ రైళ్లను భారీగా పట్టాలెక్కిస్తోంది. వీటి కోసం ప్రత్యేక రైల్వే ట్రాక్స్‌ను కూడా సిద్ధం చేసే విధంగా ప్రణాళిలు సిద్ధం చేస్తోంది.

ఇదే మొదటిది

విజయనగరం-రాయ్‌పూర్ మార్గంలో నడుస్తున్న వందేభారత్ రైలు ఇదే మొదటిది. విశాఖ-దుర్గ్ మధ్య నడిచే వందేభారత్ వారంలో ఆరు రోజుల పాటు ఉదయం 5:45 గంటలకు దుర్గ్ నుంచి బయలుదేరుతోంది. అదే రోజు మధ్యాహ్నం 1:45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అదే విధంగా వారంలో ఆరు రోజుల పాటు మధ్యాహ్నం 2:50 గంటలకు విశాఖ నుంచి తిరుగు ప్రయాణం అవుతుంది. అదే రోజు రాత్రి 10:50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ వందేభారత్ రైలు సెప్టెంబర్ 20 నుంచి తరచుగా విశాఖ-దుర్గ్ మధ్య ప్రయాణం చేయనుంది. వారానికి ఆరు రోజుల పాటు విశాఖ-దుర్గ్ మధ్య రోజుకు రెండు సార్లు వందేభారత్ ప్రయాణించనుంది.

త్వరలోనే భూమి పూజ

విశాఖ రైల్వే‌జోన్ అంశంపై కూడా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు కీలక అప్‌డేట్ ఇచ్చారు. ‘‘రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ జరగనుందని ఆయన వెల్లడించారు. దసరా తర్వాత మంచి రోజు చూసుకుని పనులు ప్రారంభిస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు సాకారమయ్యాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపి ప్రపంచానికి మేకిల్ ఇండియా కెపాసిటీ చూపిస్తున్నాం. ప్రస్తుతం రైల్వేలు, పౌర విమానాయన సంస్థలు పోటీ పడి మరీ పని చేస్తున్నాయి’’ అని రామ్మోహన్‌నాయుడు చెప్పారు.

Tags:    

Similar News