జగన్‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్
మద్దతు కావాలని కోరి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్.;
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం కేంద్ర ర„ý ణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు తెలపాలని కోరారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్ పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున కూడా పోటీ చేయాలని భావిస్తుండటంతో కేంద్రం పెద్దలు అన్ని రాష్ట్రాల నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడకట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్దికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. మద్దతు ఇచ్చే విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతానని వైఎస్ జగన్ చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.