ఇద్దరు దుర్మరణం..గాలిమోటార్లో బయలుదేరిన సీఎం

కష్టకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు అంటూ సీఎం చంద్రబాబు ప్రశంసించారు.

Update: 2025-10-29 08:58 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయస్తున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో కొనసాగనున్న సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ చేయనున్నారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ చేస్తారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో ల్యాండ్ కానున్నారు. ఓడలరేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశించారు. తుఫాన్ నష్టం అంచనాలను త్వరితగతిన సిద్దం చేయాలని సూచనలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు పలు సూచనలు చేశారు. 
 ఈ సందర్భంగా సీఎం మట్లాడుతూ.. గత నాలుగైదు రోజుల నుంచి మొంథా తుఫాన్ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టాం.  సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్‌తో సహా అంతా కలిసి టీమ్ గా పనిచేశాం. కష్టకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. మరో రెండు రోజులు ఇదే విధంగా పని చేస్తే... బాధిత ప్రజలకు మరింత ఊరట ఇవ్వగలం. తుఫాన్ వెలిసింది కాబట్టి... వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా అధికారులు పని చేయాలి. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి.. వారికేమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలి అని అన్నారు. 
మొంథా తుఫాను వల్ల వివిధ విభాగాల్లో కలిగిన నష్టాన్ని అంచనా వేయాలి.. కేంద్రానికి నివేదిక అందివ్వాలి. తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించాలి... నిర్వాసితులను ఆదుకోవాలి.  ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల నష్టాన్ని చాలా వరకు నివారించగలిగాం.  సచివాలయాలపై మైక్ అనౌన్స్‌మెంట్ సిస్టంను ఏర్పాటు చేసి కింది స్థాయి వరకూ ప్రభుత్వ ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాం. ఇదొక నూతన విధానం తీసుకొచ్చాం.  తుఫాన్‌ను ఎవరూ నివారించలేరు... కానీ ముందు జాగ్రత్తలతో నష్టాలను నివారించగలుగతాం.
కలెక్టర్లు, అధికారులు కంట్రోల్ రూమ్ లో కూర్చుని రియల్ టైం సమాచారం తెప్పించుకుని జాగ్రత్తలు తీసుకున్నారు.  ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్‌ సిబ్బంది బాగా పని చేశారు. చెట్లు కూలినా, విద్యుత్ వైర్లు తెగిపడినా యుద్ధప్రాతిపదికన తొలగించారు. అన్ని మున్సిపాలిటీల్లో డ్రెయిన్లు క్లీన్ చేయడం వల్ల కాలనీలను ముంపుబారిన పడకుండా చేశాం.  దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను కూడా పునరుద్ధరించేందుకు 10 వేలమందిని అందుబాటులో పెట్టుకున్నాం. నేడు మధ్యాహ్నానికి సాధారణ స్థితి ఏర్పడుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాన్ కారణంగా ఇద్దరు చనిపోయారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. మన చర్యలతో ప్రభుత్వంపై భరోసా పెరిగింది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 
Tags:    

Similar News