చంద్రబాబు హామీలన్నీ సూపర్ ఫెయిల్యూరే

అయినా సూపర్ సిక్స్ ‘సూపర్ హిట్ ’ అని బుకాయిస్తున్నారు: కాంగ్రెస్ తులసిరెడ్డి

Update: 2025-12-02 04:22 GMT

ఎన్నికల సందర్భంగా టిడిపి నేతృత్వంలోని కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో అనేక హామీలు ఇంకా అమలుకే నోచుకోలేదుఅయినప్పటికీ సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుకాయిస్తున్నదని రాజ్యసభ మాజీ సభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు.

మంగళవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సూపర్ సిక్స్ ఫెయిల్యూర్స్ లో ఇరుక్కుపోయిందని ఆయన అన్నారు.

"ఈ ఫెయిల్యూర్స్ లో  నిరుద్యోగ భృతి ప్రధానమైనది.  ప్రతి నిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది .రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి 17 నెలలు అయింది. నెలకు 3000 రూపాయలు చొప్పున 17 నెలలకు 51 వేల రూపాయలను నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. కనీసం వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అయినా నిరుద్యోగ భృతిని అమలు చేయాలి," అని తులసి రెడ్డి డిమాండ్ చేశారు .

అదేవిధంగా 19 -- 59 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం   అనేది మరొక సూపర్ ఫెయిల్యూర్ అని ఆయన అన్నారు. "ఇది సూపర్ సిక్స్ హామీలలో పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు ఒక్క కోటి 80 లక్షల మంది ఈ మధ్య వయసులో ఉన్న ఆడబిడ్డలు ఉన్నారు. నెలకు 1500 రూపాయలు చొప్పున 17 నెలలకు 25,500 రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది .ఆడబిడ్డలను నమ్మించి మోసగించడం శోచనీయం. కనీసం వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అయినా ఆడబిడ్డ నిధిని అమలు చేయాలి," అని తులసి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని సూపర్ సిక్స్ హామీలలో చెప్పడం జరిగింది, ఇది మీ సూపర్ హిట్స్ లో ఎందుకు లేదు, అని తులసి రెడ్డి ప్రశ్నించారు.
"రాష్ట్రంలో 17 లక్షల మంది ఈ పథకం కింద అర్హులు ఉన్నారు .నెలకు 4000 రూపాయలు చొప్పున 17 నెలలకు 68 వేల రూపాయలు ఈ వర్గాలకు ఎగ్గొట్టడం జరిగింది.దీనికి సమాధానం చెప్పాలి. ఎప్పటి నుంచి అమలుచేస్తారో ప్రకటించాలి,"అని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ‘సూపర్ హిట్ ’ అబద్దాలు చెప్పడం మానుకొని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు


Tags:    

Similar News