తిరుపతి తొక్కిసలాటపై టీటీడీ అలా.. ఏపీ హైకోర్టు ఇలా
టీటీడీ చరిత్రలో 2025 జనవరి 8 బుధవారం బ్లాక్‌డేగా నిలిచి పోయింది.;
ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో తొక్కిసలాట దుర్ఘటన మాయని మచ్చగా నిలిచి పోయింది. టీటీడీ చర్రితలోనే 2025 జనవరి 8 బుధవారం బ్లాక్‌డేగా మారిపోయింది. టీటీడీ పాలక మండలి అనుచిత నిర్ణయాలు, సమన్వయ లోపాలు వెరసి భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఒక పక్క అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే..మరో వైపు సారీ చెప్పినంత మాత్రానా తొక్కిసలాటలో చనిపోయిన వారు తిరిగి రారు కాదా.. తొక్కిసలాటలో పాలక మండలి తప్పేమి లేదు అని బాధ్యతాయుతమైన టీటీడీ చైర్మన్ చైర్‌లో ఉన్న బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు..ఆయన బాధ్యతా రాహిత్యాన్ని.. ప్రజలు..భక్తులపై ఆయనకున్న చిత్త శుద్ధిని ప్రపంచానికి చాటి చెప్పాయి. మరి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యాఖ్యలు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీద ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కానీ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కానీ..ఎన్డీఏ పక్షమైన బీజేపీ ప్రభుత్వ పెద్దలు కానీ చర్యలు తీసుకునే దమ్ము..ధైర్యం ఉందా? అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.