ఒంటిమిట్టిలో ఘోరం..ముగ్గురు మృతి
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడిపంల్లి వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.;
By : The Federal
Update: 2025-04-14 13:33 GMT
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఒంటిమిట్టలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద మూడు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో పోలీసు రక్షక వాహనంలో ఉన్న కానిస్టేబుల్ రఘునాథరెడ్డితో పాటు ఆ వాహనం డ్రైవర్ కూడా ఉన్నారు. మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ఒక వాహనం నుజ్జునుజ్జు కాగా, మరో రెండు వాహనాలు బాగా డ్యామేజ్ అయ్యాయి. తిరుపతి వైపు నుంచి హై స్పీడ్‌లో వచ్చిన స్కార్పియో వాహనం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన స్కార్పియో వాహనం ఆర్టీసి బస్సుతో పాటు పోలీసు రక్షక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో స్కార్పియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. స్కార్పియోలో ప్రయాణిస్తూ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న మృతులను ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. నంద్యాల జిల్లా హెడ్‌క్వార్టర్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారుగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన వారినికి కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న ఒంటిమిట్ట, రాజంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. స్కార్పియో వాహనం మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్థారణకు వచ్చారు.