ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఇంట్లో విషాదం..ఓదార్చిన చిరంజీవి
టీడీపీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మరణించారు.
టీడీపీ ఎమ్మెల్సీ, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు, సీనియర్ రాజకీయ నేత, సీ రామచంద్రయ్య కుమారుడు విష్ణుస్వరూప్ శనివారం హైదరాబాద్‌లో మృతి చెందారు. విష్ణుస్వరూప్ కు తీవ్ర గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. దీంతో రామచంద్రయ్య ఇంట్లో విషాదం అలుముకుంది. సీ రామచంద్రయ్య కుమారుడు విష్ణుస్వరూప్ మరణ వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన రామచంద్రయ్య నివాసానికి వెళ్లారు. మృతి చెందిన విష్ణుస్వరూప్ భౌతిక గాయానికి నివాళులు అర్పించారు. రామచంద్రయ్యను ఓదార్చారు. సీ రామచంద్రయ్యకు చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. ప్రజారాజ్యం పార్టీలో ఇద్దరు కలిసి నడిచారు. అప్పటి వరకు టీడీపీలో ఉన్న రామచంద్రయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరారు. పీఆర్పీలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి తర్వాత రెండో నాయకుడిగా రామచంద్రయ్య ప్రజారాజ్యం పార్టీలో చక్రం తిప్పారు.