ఇదో వెరైటీ పాము... దీని పేరేంటో తెలుసా?

రంగుల్లో కనువిందు చేసే పాము పాడేరులో రెండు రోజుల క్రితం కనిపించింది. చూసేందుకు ఎంతో అందంగా కనిపించే ఈ పాము కనురెప్పపాటులో మాయం అవుతుంది. ఇది అరుదైన జాతి.

Update: 2024-10-10 03:10 GMT

పాములు ఎన్నో రకాలు చూస్తుంటాం. త్రాచుపాముల్లో చాలా రకాలు ఉన్నాయి. అడవుల్లో చెట్లపై సంచరించే జాతి పాములు కూడా మనం చాలా చోట్ల చూసే ఉంటాం. కొన్ని రకాల చెట్టిరిక పాములు పసుపు, ఎరుపు, నలుపు, చెట్టు బెరడు వంటి రంగుల్లో ఉంటాయి. చెట్ల కొమ్మలపై ఉంటూ మనకు కనిపించవు. చెట్టుపై కొమ్మల రంగుల్లో ఉండటంతో కనిపించే అవకాశం తక్కువ. నీటి వనరులు, చల్లదనం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో చెట్టిరిక పాములు ఎక్కువ కనిపిస్తాయి. అయితే మూడు రంగులు కలిసిన ఒక పాము పాడేరులో కనిపించింది.

ఆ పాము చూసే వారికి ఆసక్తిని కలిగించింది. పాము తల చెట్టిరిక పామును పోలి ఉంది. త్రాచు పాముల మాదిరి పడగ లేదు. పాము పడగ విప్పేది కాదని ఎవరైనా ఇట్టే చెబుతారు. అయితే రంగులు ముదురు తోపు వర్ణంలో ఉండటంతో చూడగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. సుమారు 25 ఏళ్లలో పాడేరు ఏరియా అడవుల్లో కానీ, పాడేరు గ్రామ ప్రాంతాల్లో కానీ ఎప్పుడూ ఈ పామును చూడలేదని స్థానికులు తెలిపారు. పాడేరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొండబాబు మాట్లాడుతూ పాడేరు, అరకు ప్రాంతాల్లో ఎన్నో సార్లు రకరకాల పాములను చూశాము. దాదాపు మూడు దశాబ్దాల్లో ఇటువంటి పామును చూడలేదని తెలిపారు.

తల నుంచి తోక వరకు డబ్ల్యు ఆకారంలో చుట్టూ కట్టులా తెలుపు రంగులోనూ, తెలుపు, ఎరుపు, గులాబీ, తెలుపు రంగులు కలిపి కొంచెం వెడల్పుతో మరో కట్టులా పాము చుట్టూ ఉంది. మొదటిది వంకలు తిరుగుతూ తెల్లగా పాము చుట్టూ కట్లుకట్లుగా ఉండటం, మూడు రంగులతో ఉన్న మరో కట్టు కొంచెం వెడల్పుగా ఉండటం, వాటి కంటే మరి కొంచెం వెడల్పుగా పూర్తి నల్లగా ఈ రెండు రంగుల మధ్య ఉండటం, పైగా పాము మెరుస్తుండటంతో చూపరులను ఆకట్టుకుంది. జనాన్ని చూసిన పాము అటు, ఇటూ దూకేందుకు ప్రయత్నించింది. చెట్లపైకి ఎగిరేందుకు ప్రయత్నించింది.

Delete Edit

ఈ పాము పాడేరులోని చాకలిపేటలో ఉపాధ్యాయుడు ఒంపురి కేశవరావు ఇంటి రెండో అంతస్తులోని వంటగదిలో కనిపించింది. ఈపాము వంటగదిలోని రెండో అంతస్తులోకి ఎలా వచ్చిందో వారికి అర్థం కాలేదు. ఇంట్లో రంగు రంగుల పాము ఉందని తెలియటంతో ఇంటి వారు భయంతో వణికి పోయారు. ఇంట్లోని వారంతా పరుగులు తీసి బయటకు వచ్చారు. పాము పూర్తిగా కట్లపాము మాదిరి ఉంది. చాలా చలాకీగా పాము ఉంది. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ బండారు వాసుకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న వాసు ఆ టీచర్ ఇంటికి చేరుకున్నారు.

పామును చూడగానే బండారు వాసు మాట్లాడుతూ ఒరంటే ప్లయింగ్ గా చెప్పారు. ఎగిరే స్వభావం గల ఈ పాము అడవుల్లో రాత్రులు ఎక్కువగా సంచరిస్తుందని తెలిపారు. ఇక్కడికి ఎలా వచ్చిందనేది అర్థం కావటం లేదన్నారు. కొంత మంది చెట్లు నరికి కొమ్మలు అలాగే ట్రాక్టర్లు, లారీల్లో వేసుకుని వచ్చినప్పుడు ఆ కొమ్మలపై అలాగే ఉండటం వల్ల వచ్చే అవకాశం ఉందని, పైగా ఇండ్లలోకి ఈ పాము అసలు రాదన్నారు. ఇక్కడికి వచ్చిందంటే ఏదో దారి తప్పి వచ్చినట్లేనన్నారు. పామును వాసు చాకచక్యంగా పట్టుకున్నారు. పామును ఎక్కడ పట్టుకోబోయినా తల రివ్వున అక్కడికి వస్తుందని, పరికరాలు లేనిది ఈ పామును పట్టుకోవడం చాలా కష్టమని వాసు తెలిపారు. పట్టుకున్న పామును ఆయన పాడేరు ఘాట్ రోడ్డులోకి తీసుకెళ్లి అక్కడ అడవిలో వదిలిపెట్టారు. పాములు ప్రకృతిలో బయో డైవర్సిటీకి ఎంతగానో ఉపయోగ పడతాయని తెలిపారు. చెట్లపై సంచరించే పాములు ఎంతో చురుకుదనంతో ఉంటాయని వాసు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి పామునైనా వాసు ఇట్టే పట్టేస్తాడు. అయితే పట్టుకున్న పాములను దూరంగా అడవుల్లో తిరిగి వదిలేస్తాడు.

Tags:    

Similar News