ఏపీ పాలిసెట్‌ ఫలితాలు–టాపర్లు వీరే

మంత్రి నారా లోకేష్‌ పాలీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. 19 మంది విద్యార్థులకు 120కి 120 మార్కులు తెచ్చుకున్నారు.;

Update: 2025-05-14 14:37 GMT

మంత్రి నారా లోకేష్‌ బుధవారం విడుదల చేసిన పాలిసెట్‌ ఫలితాలలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ర్యాంకులు సాధించారు. 120 మార్కులకు గాను 120 మార్కులు తెచ్చుకున్న 19 మంది విద్యార్థుల్లో అమ్మాయిలు కూడా ఉన్నారు. ఐదుగురు అమ్మాయిలు 120 మార్కులకు 120 మార్కులు సాధించారు. ఈ 19మంది విద్యార్థుల్లో 15 మంది కేవలం ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. వీరితో పాటు విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బి వెంకట్, విశాఖ జిల్లాకు చెందిన బాలినేని కల్యాణ్‌రామ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మెర్ల జేఎస్‌ఎస్‌వీ చంద్రహర్ష, ప.గోకు చెందిన వి ప్రవళిక, తూ.గోకు చెందిన ఆకుల నిరంజన్‌ శ్రీరామ్, విశాఖకు చెందిన చింతాడ చోహాన్, ప.గోకు చెందిన కోదాటి కృష్ణప్రణయ్, తూ.గోకు చెందిన బి రక్షిత శ్రీ స్వప్ప, తూ.గోకు చెందిన ఆర్‌ చాహ్నా, ప.గోకు చెందిన యు చక్రవర్తుల శ్రీ దీపిక, ప్రకాశంకు చెందిన చలువాది ఖాదిరేష్, కాకినాడ జిల్లాకు చెందిన కొప్పిశెట్టి అభిజిత్, ప.గోకు చెందిన పీ నితీష్, తూ.గోకు చెందిన వై హేమచంద్రకుమార్, ప.గోకు చెందిన ఎ యశ్వంత్‌ పవన్‌ సాయిరామ్, తూ.గోకు చెందిన శ్రీనిధి టాప్‌ ర్యాంకులు సాధించిన వారిలో ఉన్నారు.

బుధవారం మంత్రి విడుదల చేసిన పాలిసెట్‌ ఫలితాలలో 95.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధికంగా 98.66 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి లోకేష్‌ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,39,840 మంది పరీక్షలు రాయగా, 1,33,358 మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి లోకేష్‌ వెల్లడించారు. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్‌ అభినందనలు తెలిపారు.
Tags:    

Similar News