అన్నదమ్ములను కాటేసిన పాము..ప్రాణాలు విచిడిన తమ్ముడు

నిద్రబోతున్న సమయంలో ఇంట్లోకి పాము దూరి ఇద్దరిని కాటేసింది. అనంతపురం జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Update: 2025-12-03 10:49 GMT

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కండ్ల గూడూరు గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకుంది. అల్లారు ముద్దుగా పెరుగుతున్న అన్నదమ్ములిద్దరినీ పాము వెంటాడింది.  నిద్రపోతున్న ఇద్దరు చిన్నారులను పాము కాటు వేసింది. పాము కాటుకు తమ్ముడు ప్రాణాలు విచిడి మృతి చెందగా, అన్నపరిస్థితి విషమంగా ఉంది. ప్రాణాలతో పోరాడుతున్నాడు. మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు కుప్పకూలగా, కుటుంబ సభ్యులను, స్థానికులను కలచివేసింది.

అపర్ణ, వీరనారాయణ స్వామి అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కండ్ల గూడూరు గ్రామానికి చెందిన దంపతులు. వీరికి శివరామరాజు, శివనారాయణ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరు ఐదో తరగతి, మరొకరు నాలుగో తరగతి చదువుతున్నారు. అయితే మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము ఇంట్లోకి చొరబడింది. పక్కపక్కనే నిద్రబోతున్న అన్నదమ్ములిద్దరినీ కాటేసింది. అయితే నిద్రలో ఉన్న ఆ చిన్నారులు ఆ పామును కానీ,  పాము వారిని కాటేసిందని కానీ  గమనించలేదు. అయితే కొంతసేపటి తర్వాత పాము కాటుకు విషయం ఎక్కడంతో ఆ బాధను భరించలేక ఇద్దరూ తీవ్రమైన నొప్పితో బాధపడటం మొదలుపెట్టారు.  నిద్రలో నుంచి వెంటనే తేరుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన  ఆ ఇద్దరు చిన్నారులను వారికి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆ ఇద్దరిలో తమ్ముడు శివనారాయణ మృతి చెందాడు. అన్న శివరామరాజు పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. మరో వైపు ఇద్దరు కుమారుల్లో ఒకరు మృతి చెందడం, మరొకరు అపస్మారక స్థితిలో ఉండటంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన కుటుంబ సభ్యులనే కాకుండా  స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News