చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలు కాగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Update: 2024-12-08 05:57 GMT

పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. గీతికా స్కూల్‌ వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికి అక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధరించారు. తెల్లవారు ఝాము కావడం, డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మృతులను శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్‌, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి, యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త కారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారు. అక్కడ పూజలు పూర్తి చేసుకుని స్వామి వారిని దర్శించి తిరిగి వస్తున్నారు. దేవుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా సంఘటన జరగటంతో బంధువులు బోరు మంటున్నారు. ఎంతో ఆనందంగా గడపాల్సిన కుటుంబం చివరకు ఇలా జీవితాన్ని ముగించాల్సి వచ్చిందని బంధువులు తెలిపారు.


Tags:    

Similar News