ముగిసిన గణనాథుడి నిమజ్జన మహోత్సవాలు.. పాల్గొన్న సీఎం రేవంత్..

గణేష్ చతుర్దశి వేడుకలు దేశమంతా ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి.

Update: 2024-09-17 12:30 GMT

గణేష్ చతుర్దశి వేడుకలు దేశమంతా ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి చోటా వినాయక చవితి పూర్తి భక్తి శ్రద్దలతో నిర్వహించి.. గణనాథుడిని గంగమ్మ ఒడికి సాగనంపారు. నేటితో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల నిమజ్జన కార్యక్రమాలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ నిమజ్జన కార్యక్రమం కూడా మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. వినాయకుని నిమజ్జన కార్యక్రమానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవడం తెలంగాణలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈసారి తెలంగాణలో గణేశ చతుర్థి ఔరా అనిపించేలా జరిగింది. ప్రతి ప్రాంతంలో ఎంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు. లడ్డూ వేలం పాట కూడా ఈ ఏడాది అద్భుతంగా జరిగింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ ఏడాది ఈ లడ్డూ వేలం పాటే తెలంగాణలో అత్యధికం కావడం విశేషం.

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు

హైదరాబాద్ ఎన్‌టీఆర్ మార్గ్‌లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. నిమజ్జనానికి ముందు నిర్వహాకులు గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం మొదలైన గణేశుని శోభాయాత్ర.. మంగళవారం మధ్యాహ్నం పూర్తయింది. ఈ శోభాయాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా.. భక్తులు తాకిడి ఊహించిన దానికంటే అధికంగానే ఉందని కొందరు చెప్తున్నారు. గణేశుని నిమజ్జనం ఈరోజు భారీ సంఖ్యలో జరిగాయి. ట్యాంక్‌బండ్, ఎన్‌టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాల్లో గణనాథుడి విగ్రహాలు వేల సంఖ్యలో నిమజ్జనం అయ్యాయి. ఈ నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి.. ట్యాంక్‌బంద్ వద్దకు చేరుకున్నారు.

ట్యాంక్‌బండ్‌పై సీఎం ముచ్చట్లు..

నిమజ్జన ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు 11 గంటల సమయంలో ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుని పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా తీసుకున్న చర్యలపై పోలీసులతో చర్చించారు. కార్పొరేషన్ అధికారులు, జోనల్ కమిషనర్లు, నగర పోలీసులు, ట్రాఫిక్ విభాగంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్ల గురించి ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించారు సీఎం. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్లు, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌, ఇతర అధికారులతో కలిసి రేవంత్ రెడ్డి.. నెక్లెస్ రోడ్ ఫుట్‌పాత్‌పై తిరిగారు. ప్రజలతో మాట్లాడి.. నిమజ్జ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. అదే విధంగా కొన్ని యూత్ యూనిన్లతో కూడా ఈ అంశంపై చర్చించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రిచ్ విల్లాస్ రిచెస్ట్ రికార్డ్..

హైదరాబాద్‌లోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో ఈ లడ్డూ వేలం పాట కీలకంగా మారింది. ఎన్నడూ లేని విధంగా ఈ విల్లాస్‌లోని గణేశుని లడ్డూ రూ.1.87 కోట్ల ధర పలికింది. ఆ విల్లాస్‌లో ఉండేవారంతా ధనవంతులే కావడంతోనే లడ్డూ వేలం పాట దాదాపు రెండు కోట్ల రూపాయలను చేరిందని అక్కడి వారు చెప్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ గణేశుని లడ్డూ వేలం పాట అంటే ఎక్కువగా బాలాపూర్ వినాయకుడు గుర్తుకొస్తాడు. కానీ ఈసారి అక్కడ లడ్డూ వేలం పాట రూ.30 లక్షల వరకే వెళ్లింది. ఇప్పుడు కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో సాగిన వేలం పాట ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.

Tags:    

Similar News