6లక్షలతో భారీ లడ్డూను దక్కించుకున్న టీడీపీ మహిళా ఎంపీ

కర్నూలు జిల్లాలో ఓ వినాయక మండపం వద్ద లడ్డూ వేలం పాటలో ఎంపీ పాల్గొన్నారు.;

Update: 2025-09-04 06:44 GMT

వినాయక చవిత సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసే గణేషుడి లడ్డూను దక్కించుకునేందుకు అనేక మంది భక్తులు పోటీపడుతారు. లడ్డూను సొంతం చేసుకునేందుకు ఎవరికి వారు ఆరాట పడుతారు. అందుకోసం లక్షలు వెచ్చించడానికి కూడా వెనుకాడరు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా అదే పని చేశారు. వినాయకుడి లడ్డూను దక్కించుకునేందుకు లక్షలు వెచ్చించేందుకు ఆసక్తి చూపించారు. లడ్డూ కోసం నిర్వాహకులు నిర్వహించిన వేలం పాటలో పాల్గొన్న ఆమె ఎక్కువ మొత్తంలో పాడి అందరి కంటే ఆమె ముందు వరుసలో నిలిచారు. రూ. 6.01లక్షలతో వినాయకుడి లడ్డూను ఆమె దక్కించుకున్నారు. కర్నూలు నగరం ఓల్డ్‌ సిటీలోని రాంబొట్ల ఆలయం వద్ద వినాయకుడి లడ్డూ వేలం పాటలో పాల్గొన్న ఆమె అందిరి కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి వినాయకుడి లడ్డూని ఆమె దక్కించుకున్నారు. దీంతో వినాయకుడి మండపం నిర్వాహకులు ఆ భారీ లడ్డూను తెలుగుదేశం పార్టీ మహిళా ఎంపీ బైరెడ్డి శబరికి అందజేశారు.

Tags:    

Similar News