టీడీపీకి అందే కేంద్ర బెర్త్‌లు ఖరారు.. ఎన్నంటే..!

2024 సార్వత్రి ఎన్నికల్లో ఎన్‌డీఏ, ఇండి కూటముల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఫలితాల్లో కూడా రెండు కూటములు నువ్వానేనా అన్నట్లే తలపడ్డాయి.

Update: 2024-06-08 13:14 GMT

2024 సార్వత్రి ఎన్నికల్లో ఎన్‌డీఏ, ఇండి కూటముల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఫలితాల్లో కూడా రెండు కూటములు నువ్వానేనా అన్నట్లే తలపడ్డాయి. ఎన్‌డీఏ కూటమి 292 సాధించింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం రావాలంటే బీహార్‌లోని జేడీయూ, ఆంధ్రలోని టీడీపీ కీలకంగా మారాయి. దీంతో బీహార్ జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కాపాడుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఈ రెండు పార్టీలకు కేంద్ర కేబినెట్‌లో స్థానాలు అందించనుంది. దీంతో వారిద్దరి కూటమిలోనే ఆపిన బీజేపీ.. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు సన్నాహాలు చేస్తోంది. మోదీ 3.0 సర్కార్‌గా ఈ ప్రభుత్వాన్ని ప్రమోట్ చేస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మోదీ కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మోదీ ప్రమాణ స్వీకార వేడుక ఆహ్వాన పత్రికలను కూడా ప్రచురించడం జరిగింది. ఈ వేడుక కోసం ఢిల్లీలోని రెండు రోజుల పాటు నోఫ్లై జోన్‌గా కూడా ప్రకటించారు.

అయితే టీడీపీ, జేడీయూ పార్టీలను కూటమిలోనే ఉంచడానికి ఎక్కువ మొత్తంలోనే కేంద్ర కేడర్ బెర్త్‌లను అందించింది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. టీడీపీకి నాలుగు మంత్రిత్వ శాఖలను కేటాయించింది. అదే విధంగా జేడీయూకు రెండు కేంద్ర మంత్రుల పదవులను అందించింది. కాగా ఇప్పటికే ఆ మంత్రి పదవులను అందుకోనున్న అభ్యర్థులు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రధాని ప్రమాణ స్వీకారం తర్వాత వారిని ప్రకటించొచ్చని, చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత వారిని మరోసారి ఖరారు చేస్తారని తెలుస్తోంది.

ఎన్‌డీఏ కూటమి అందుకున్న 292 ఎంపీ స్థానాల్లో బీజేపీ సొంతంగా సంపాదించిన స్థానాలు 240 మాత్రమే. మిగిలిన స్థానాలు అన్నీ కూడా టీడీపీ 16, జేడీయూ 12, శివసేన 7, లోక్‌జనశక్తి 5 ఇలా ఇతర కూటమిప పార్టీలు కలిపి 50 ఎంపీ సీట్లు కూటమికి అందించాయి.

Tags:    

Similar News