ఎప్పటికీ గుర జాడే అనుసరణీయం

సాహిత్యంలోనూ, సంఘ సంస్కరణలోనూ కథలు , కథానికల్లోనూ, కవిత్వం లోనూ గురజాడ తత్వం ఆచరణీయం

Update: 2024-04-15 07:20 GMT

గురజాడ పాత్రలు నూటికి నూరుపాళ్ళు మానవ వ్యక్తులు అవి జీవిస్తూ జీవనాన్ని కదిలిస్తాయి జీవం అనేది ఉంటే అన్న కట్టమంచి రామలింగారెడ్డి మాటలు అక్షర సత్యాలు కన్యాశుల్కంలో గిరీశం మధురవాణి లుక్దావదానులు సౌజన్య రావు పంతులు వెంకటేశం వంటి పాత్రలు రక్త మాంసాలు ఉన్న పాత్రలు వాటిని సృష్టించడం వల్లే కన్యాశుల్కం తెలుగు సాహిత్యంలో గొప్ప స్థానాన్ని అలంకరించింది నవ్యాంధ్ర సాహితీ జగత్తుకు వెలుగు చూపిన సాహితీ దివ్య గురజాడ గురజాడ సాహితీ వికాసానికి గాక నవ సమాజాన్ని నిర్మాణానికి పునాదులు వేసింది గ్రాంథిక భాష సంఖ్యలను ఛేదించి వ్యవహారిక భాషకు ఊపిరి పోసింది తెలుగు సాహిత్యాన్ని సామాన్యునికి కూడా చేరువ చేసిన నవయుగ ప్రస్థాన కర్త గురజాడ

తొలి కథానిక దిద్దుబాటు ఆయన కలం నుంచి జాలువారింది. మెట్టిల్లు, మతం, నీ పేరేమిటి, పెద్ద మసీదు, దేవుడు చేసిన మనుషులు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ, కన్య కాలవన రాజు కథ, మెరుపులు, సుభద్ర, ముత్యాలసరాలు, నీలగిరి పాటలు మొదలైనవి గురజాడ ప్రతిభకు గీటురాళ్లు. స్త్రీ జనార్ధరణ సంఘసంస్కరణ వ్యవహారిక భాషా ఉద్యమం ఈ మూడు గురజాడ సాహిత్యానికి మూడు కళ్ళు చక్కనైన ఎత్తుగడ. పాటకుడిని కట్టిపడేసే శిల్పం సామాన్య మానవుల జీవితాలతో ముడిపడి ఉన్న ఇతివృత్తం ఆయన కథా వస్తువు. అందుకే ఏళ్లు గడిచినా దశ దశాబ్దాలు దాటుతున్నా ఆయన కథలు ఇంకా తెలుగువారి గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నాయి.

గిడుగు రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషా ఉద్యమం ఉదృతంగా నడుస్తున్న రోజుల్లో గురజాడ తన రచనల ద్వారా ఆ ఉద్యమాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, కన్యాశుల్కం వంటి సామాజిక దురాగతాల నేపథ్యంలో మలచిన ఆధునిక మహాకావ్యం తొలి తెలుగు సామాజిక నాటకం కన్యాశుల్కం. 1993లో కన్యాశుల్కం నాటకానికి శతాబ్ది ఉత్సవాలు జరిపినప్పటికీ ఆ నాటకం ఇంకా నిత్య నూతనంగా ఉండటమే గురజాడ రచనల విశ్వసనీయం, విశ్వకవి, విశ్వకవిసం, అనడానికి నిలువెత్తు నిదర్శనం. కన్యాశుల్కంలో మధురవాణి గిరీశం లుక్దావదానులు బుచ్చమ్మ. ఇలా ప్రతిపాత్ర సమాజంలో ఇప్పటికీ మన చుట్టూ తిరుగుతూ కనిపించడం ఆయన రచనల వాస్తవికతకు సాక్ష్యం.

మంచి చెడ్డలు ఎంచి చూడగా మనుషులందరూ రెండు కులములు.. మంచి అన్నది మాల అయితే మాల నేను అంటూ కులమత రహిత సమాజ స్థాపనకు గురజాడ కృషి చేశారు ముత్యాల సరాలు ద్వారా చందసకు నూతన భాష్యం చెప్పిన గొప్ప అలంకారికుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆయన చేసిన మార్గంలో మానవత జాడలను గుర్తిస్తూ పయనించడమే మనం అర్పించే ఘన నివాళి.

దేశమును ప్రేమించుమన్నా

మంచి అన్నది పెంచుమన్నా!

వొట్టి మాటలు కట్టిపెట్టోయి

గట్టి మేలు తలపెట్టవోయి.

పాడిపంటలు పొంగిపొర్లే

దారిలో నువు పాటుపడవోయి;

తిండి కలిగితె కండ కలదోయి;

కండ కలవాడేను మనిషోయి!

యీసురోమని మనుషులుంటే

దేశమే గతి బాగుపడునోయి?

జల్దుకొని కళలెల్ల నేర్చుకు

దేశి సరకులు నింపవోయి.

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి

దేశి సరుకుల నమ్మవలెనోయి !

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయి.

​వెనక చూసిన కార్యమేమోయి?

మంచి గతమున కొంచెమేనోయి

మందగించక ముందు అడుగేయి

వెనుకపడితే వెనకే నోయి!

పూను స్పర్థను విద్యలందే

వైరములు వాణిజ్యమందే,

వ్యర్థ కలహం పెంచబోకోయి

కత్తి వైరం కాల్చవోయి

దేశాభిమానం నాకు కద్దని

వొట్టి గొప్పలు చెప్పుకోకోయి

పూని ఏదైనాను వొకమేల్‌

కూర్చి జనులకు చూపవోయి

ఓర్వలేమిపిశాచి దేశం

మూలుగులు పీల్చేసెనోయ్,

ఒరుల మేలుకు సంతసిస్తూ

ఐకమత్యం నేర్చవోయి

పరుల కలిమికి పొర్లి యేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయి?

ఒకరి మేల్ తన మేలనెంచే

నేర్పరికి మేల్ కొల్లలోయి!

స్వంత లాభం కొంత మానుకు

పొరుగు వాడికి తోడుపడవోయి

దేశమంటే మట్టి కాదోయి

దేశమంటే మనుషులోయి!

చెట్టపట్టాల్‌ పట్టుకొని

దేశస్థులంతా నడువవలెనోయి

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నియు మెలగవలెనోయి

మతం వేరైతేను యేమోయి?

మనసు లొకటై మనుషులుంటే

జాతమన్నది లేచి పెరిగి

లోకమున రాణించునోయి!

దేశమనియెడి దొడ్డవృక్షం

ప్రేమలను పూలెత్తవలెనోయి,

నరుల చమటను తడిసి మూలం,

ధనం పంటలు పండవలెనోయి!

ఆకులందున అణగిమణగీ

కవిత కోయిల పలకవలెనోయి;

పలుకులను విని దేశమందభి

మానములు మొలకెత్తవలెనోయి!

Tags:    

Similar News