బస్సెక్కిన చంద్రబాబు, పవన్ ,లోకేష్
'స్త్రీశక్తి 'పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం;
మహిళలకు ఉచిత బస్సు పథకం ‘స్త్రీ శక్తి’ ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన విధంగా ఆగస్ట్ 15న ఉచిత బస్సు మహిళలకు అందుబాటులోకి వచ్చింది.పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ముగ్గురు ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టి , మహిళలతో మాటామంతీ కలిపారు.ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ బస్ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్, లోకేశ్ బస్సులోనే వెళ్లారు. వీరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు ఇతర కూటమి నేతలు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ వారి సంతోషంలో పాలుపంచుకున్నారు.బస్సులో పక్కన కూర్చొన్న మహిళలను చంద్రబాబు , పవన్ సూపర్ సిక్స్ పథకాల అమలు తీరుపై వాకబు చేశారు.