జాతీయ రక్షణ నిధికి స్పీకర్‌ అయ్యన్న విరాళం

నెల జీతాన్ని ఆన్‌లైన్‌ ద్వారా అందించినట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు.;

Update: 2025-05-10 07:47 GMT

ఇండియా–పాకిస్తాన్‌ యుద్ధం సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు భారత దేశం సైనిక దళాలకు మద్దతుగా నిలిచారు. జాతీయ రక్షణ నిధికి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేశారు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా ఈ విరాళాన్ని ఆయన జమ చేశారు.

ఈ సందర్భంగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ..
ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత దేశ సాయుధ దళాలు చూపిసున్న తెగువ, చేస్తున్న ధైర్యసాహసాలు ప్రతి భారతీయునిలో గర్వాన్ని కలిగించే అంశంగా ఆయన అభివర్ణించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు తన వంతుగా సంఘీభావం తెలపడంతో పాటు తన నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఆ మేరకు తన నెల జీతం రూ. 2,17000లను ఆన్‌లైన్‌ ద్వారా జాతీయ రక్షణ నిధికి ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు తెలిపారు. జాతీయ రక్షణ నిధికి తాను బదిలీ చేసిన రిసిప్ట్ ను కూడా ఆయన విడుదల చేశారు. ఉగ్రవాద నిర్మూలనలో భారత సాయుధ దళాలు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయి అని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.


Tags:    

Similar News