బండరాళ్లు పడి ఆరుగురు మృతి
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.;
By : The Federal
Update: 2025-08-03 07:15 GMT
బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిని ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో ఆదివారం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ గ్రానైట్ క్వారీలో ఒడిశాకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. బండరాళ్లు పడి ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 16 మంది కార్మికులు క్వారీలో పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.