మరణించినా.. ఆమే గెలిచింది
జిల్లాలోనే కీలక నేతగా ఎదిగారు. ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా ఆమెను గెలిపించారు.
ఎన్నికల్లో అప్పుడప్పుడు దుర్ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఎన్నికల సమయంలో పోలింగ్‌కు ముందు అనారోగ్యం వశాత్తు లేదా యాక్సిడెంట్లు వంటి సంఘటనలు చోటు చేసుకొని అభ్యర్థులు ప్రాణాలు కోల్పోతుంటారు. సరిగ్గా అలాంటి దుర్ఘటనే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలో చోటు చేసుకుంది. 2014 ఎన్నికల సమయంలో ఇదే సంభవించింది. నాడు ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్‌ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అభ్యర్థులు నామినేషన్‌లు కూడా దాఖలు చేశారు. స్వీకరణ గడువు ముగిసింది. ఇక నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇక పోలీంగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు మాత్రమే మిగిలాయి. మే 7న పోలీంగ్, మే 16న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. వీటికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. సరిగ్గా నామినేషన్‌ల ఉపసంహరణ తర్వాత రోజు చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి దుర్మరణం చెందారు.