మూడు కోతుల్లా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్..

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మండిపాటు;

Update: 2025-07-11 11:34 GMT
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. వీళ్లను మూడు కోతులతో పోల్చారు. కళ్లు, చేవులు మూసుకున్నారన్నారు. ప్రజల సమస్యలు పట్టడం లేదని దుమ్మెత్తిపోశారు.
పనిలో పనిగా ఇంకో అడుగు ముందుకేసి చంద్రబాబుకు- పేదలకు మంచి చేయాలనే ఆలోచన ఏనాడూ లేదన్నారు. ఈవీఎంలతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకే రీకాలింగ్ పేరిట చంద్రబాబు మోసాన్ని ఎండగడుతున్నాం అని ఆమె చెప్పుకొచ్చారు.
శుక్రవారం రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ విమర్శలు చేశారు. ‘‘నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు చెపుతున్నారు. విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పి.. స్కాంలలో విజనరీగా చెలామణి అవుతున్నారు. పేద పిల్లల చదువుకు చంద్రబాబు మోకాలు అడ్డు పెడుతున్నారు. పేదవాడిని మద్యం మత్తులో ఉంచి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీది కల్తీనే. చివరకు బడి పిల్లకు కూడా కల్తీ భోజనం పెడుతున్నారు.
ఏపీలో మూడు కోతుల్లా బొమ్మల్లా.. కూటమి నాయకులు ముగ్గురు ఉన్నారు. దృతరాష్ట్ర పాలనతో చంద్రబాబు కళ్లు మూసుకున్నారు. విద్యార్దుల జీవితాలు నాశనం అవుతుంటే లోకేష్ చెవులు మూసుకొన్నారు. పవర్ లేని పవన్ కల్యాణ్‌ ఈ తండ్రీకొడుకుల అరాచకాలను ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చున్నారు అని రోజా మండిపడ్డారు.
Tags:    

Similar News