జగన్‌కు మళ్లీ ఆంక్షలు.. ర్యాలీలు, సభలు పెట్టొద్దు

రేపు అనకాపల్లి మెడికల్‌ కళాశాలను జగన్‌ సందర్శించనున్నారు.

Update: 2025-10-08 05:47 GMT

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనకాపల్లి మాకవరపాలెం మెడికల్ కాలేజ్ పర్యటన కోసం చేపట్టనున్న రోడ్‌ షోకు పోలీసులు కఠిన షరతులతో అనుమతి మంజూరు చేశారు. జగన్ వాహన శ్రేణిలో కేవలం 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతిని వెంటనే రద్దు చేసి, సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

రోడ్‌ షో సందర్భంగా ఎవరైనా గాయపడినా, ప్రాణ నష్టం జరిగినా లేదా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లినా, నిర్వాహకుడు వ్యక్తిగతంగా, పరోక్షంగా బాధ్యత వహించాలని పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో జగన్ చేపట్టిన పర్యటనలకు కూడా ఇలాంటి షరతులతో అనుమతులు మంజూరు చేయగా, తాజాగా అనకాపల్లి మెడికల్ కాలేజ్ సందర్శనకు సంబంధించి కూడా పోలీసులు నిబంధనలు విధించారు.

Tags:    

Similar News