బురదలో దిగి..రైతులా మారిన రియల్ హీరో

గతంలో గిరిజన ప్రాంతాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అక్కడ చెప్పులు లేకుండా బురదలో తిరిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

Update: 2025-10-30 08:39 GMT

తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లే ప్రజా ప్రతినిధులు కానీ, అధికారులు కానీ సహజంగా ఒడ్డు నుంచే పరిశీలిస్తారు. బురద అంటుకోకుండా పంట పొలాల గట్టున నిలబడి పంట నష్ట పోయిన తీరును పరిశీలిస్తారు. సంబంధిత అధికారులు, బాధిత రైతుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం అందుకు భిన్నం. తాను కూడా రైతునే అని చెప్పిన పవన్ కల్యాణ్ దానిని నిరూపించారు. ఓ సామాన్య రైతు మాదిరిగా మోకాళ్ల వరకు ప్యాంట్ ను మడిచి, పంట పొలంలోకి దిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మోకాళ్లలోతు బురుదలో నడుచుకుంటూ వెళ్లి దెబ్బతిన పంటను పరిశీలిస్తున్న తీరుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఫిదా అయిపోయారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను మాటల మనిషిని కాదని చేతల మనిషి అని మరో సారి నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగా గురువారం ఉదయం అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్నారు. నీట మునిగిన పొలాల్లోకి స్వయంగా దిగారు. మోకాళ్లలోతు బురదలో నడుచుకుంటూ మొంథా తుపాను ప్రభావానికి నేలకొరిగిన పంటను పరిశీలించారు. పంట దెబ్బతిన్న తీరును పరిశీలించారు. పంట ఏమేరకు నష్ట పోయిందనే వివరాలను, నష్ట తీవ్రతను రైతుల నుండి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎంపీ, MLA ల నుండి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. నష్ట తీవ్రతపై ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీ D.K బాలాజీ IAS, మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, అవనిగడ్డ MLA శ్రీ మండలి బుద్ద ప్రసాద్ గారు పాల్గొని తుపాను తీవ్రత కారణంగా జరిగిన నష్టాన్ని పవన్ కల్యాణ్ కు వివరించారు.

గతంలో గిరిజన ప్రాంతాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అక్కడ చెప్పులు లేకుండా బురదలో తిరిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాను ఒక సినిమా స్టార్ అని, కానీ డిప్యూటీ సీఎం అని కానీ అనుకోకుండా ఓ సామాన్యుడిలా అందరి గిరిజనులతో పాటు బురుదలో తిరుగుతూ అందరికి ఆశ్చర్యానికి గురి చేశారు. 

 

Tags:    

Similar News