పీవీ సునీల్ ఐపీఎస్ కేసు సిసోడియా ఐఏఎస్‌కు
సునీల్‌కుమార్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు పోలీసు స్టేషన్ నుంచి ఐఏఎస్ అధికారి వద్దకు చేరింది.;
ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల్లో మరో సారి కలకలం రేగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసింది. పలువురు ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదు చేసింది. నలుగురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. తాజాగా మరో సీనియర్ ఐపీఎస్ అధికారి, పీవీ సునీల్ కుమార్ కేసును తెరపైకి తెచ్చింది. గత ఐదు మాసాలుగా ఇది నలుగుతున్నా.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఏలాగైనా సునీల్ కుమార్‌ను అరెస్టు చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీవీ సునీల్ కుమార్‌పై విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సీనియర్ ఐఏఎస్ అధికారిని విచారణ అధికారిగా నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్‌పీ సిసోడియాను విచారణ అధికారిగా నియమించింది. అంతేకాకుండా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఉన్న హరీష్ కుమార్ గుప్తాకు కూడా ఓ పని అప్పగించింది. పీవీ సునీల్ కుమార్ కేసుకు సంబంధించిన పూర్వ పరాలను విచారణ అధికారిగా నియమితులైన ఆర్‌పీ సిసోడియాకు వివరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఈ రకమైన ఉత్తర్వులను జారీ చేశారు.