వరద బాధితుల కోసం ప్రార్థనలు చేస్తున్నా

ఉత్తరాఖండ్‌ వరదల మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు.

Update: 2025-08-06 06:27 GMT

ఉత్తరాఖండ్‌లో వరదల విలయతాండవం మీద మాజీ ముఖ్యమంత్రి, వైసీసీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఉత్తరాఖండ్‌లో సంభవించిన వినాశకరమైన వరదలతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. అంటూ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో వరద బాధితులు, వారి కుటుంబాల కోసం తాను ప్రార్థనలు చేస్తున్నాను.. వారి కోసం తాను ఆలోచిస్తున్నాను.. అని పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి, వారికి భద్రత, పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, వరద బాధితులను ఆదుకునేందుకు, ఎఫెక్టీవ్‌గా బాధులందరికీ మేలు జరిగే విధంగా సహాయ చర్యలు తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు జగన్‌ పేర్కొన్నారు. ఆ మేరకు బుధవారం ఆయన జగన్‌ ట్వీట్‌ చేశారు.


Tags:    

Similar News