సరే వెళ్లొస్తా..ఢిల్లీకి పయనమైన మోదీ

గన్నవరం ఎయిర్‌ పోర్టు వరకు వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం చంద్రబాబు.;

Update: 2025-05-02 15:25 GMT

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించి తిరుగు ప్రయాణమైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం కార్యక్రమం ముగించుకుని శుక్రవారం సాయంత్రం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం 6:07 గంటలకు చేరుకున్నారు. బీజేపీ నాయకులు, అధికారులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం 6:44 గంటలకు భారత ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి సీఎం చంద్రబాబు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు, హోం మంత్రి వంగలపూడి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా వైద్యసేవలు శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య, బందరు పార్లమెంట్‌ సభ్యులు వల్లభనేని బాలశౌరి, విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేసినేని శివనాథ్‌ (చిన్ని), బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్‌ తెన్నేటి, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్‌ శ్రీనివాస్, ఎమ్మెల్సీ, చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ, ప్రభుత్వ విప్‌ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీ పి హరి ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి అనంత రాము, పోలీసు జైల్స్‌ అండ్‌ కరెక్షనల్‌ సర్వీసెస్‌ డీజీ అంజనీ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్‌ గంగాధర్‌ రావు, బీజేపీ నాయకులు ప్రధాన మంత్రి మోదీకి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు.
Tags:    

Similar News