పవన్ కల్యాణ్ కొడుకుని కాపాడిన వారికి సత్కారం
అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌తో పాటు తక్కిన చిన్నారులకు కూడా ప్రవాస భారతీయ కార్మికులు కాపాడారు.;
By : The Federal
Update: 2025-04-12 05:42 GMT
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్‌ను అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన వారిని సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ పాఠశాలలో అగ్నిప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఇదే విషయాన్ని పన్ కల్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఇది వరకే తెలిపారు.
సింగపూర్‌లో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న పాఠశాలలోని మూడో అంతస్తులో ఈ నెల 8న అగ్ని ప్రమాదం జరిగింది. పొగలు చుట్టుకోవడంతో అందులోని చిన్నారులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్‌తో పాటు మరో 22 మంది చిన్నారులు చిక్కుకున్నారు. చిన్నారుల అరుపులు విన్న నలుగురు ప్రవాస భారతీయ కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారిని రక్షించేందుకు రంగంలోకి దిగారు.
ప్రమాదంలో చిక్కుకున్న చిన్నారులను సురక్షితంగా ప్రాణాలతో రక్షించారు. ప్రవాస భారతీయులు చూపించిన తెగువ, ధైర్య సాహసాలను ప్రదర్శించిన తీరు పట్ల సింగపూర్ ప్రభుత్వం మెచ్చుకుంది. అంతటితో ఆగని సింగపూర్ ప్రభుత్వం ఆ నలుగురు ప్రవాస భారతీయ కార్మికులను సత్కరించాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ప్రవాస భారతీయ కార్మికులను సత్కరించి గౌరవించింది. మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపిన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి, మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు.