అనారోగ్యంలోనూ పర్యటించిన పవన్ కల్యాణ్.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. అయినా తన విధుల్లో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ ప్రాంతాల్లో పర్యటించారు.

Update: 2024-09-09 15:27 GMT

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. అయినా తన విధుల్లో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీని పరిశీలించారు. అనంతరం అన్ని సమస్యలను పరిస్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, అందుకే అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పర్యటనకు వచ్చానని చెప్పారు.

కలెక్టర్‌తో కొనసాగుతున్న చర్చలు

ఏలేరు రిజర్వయార్ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వాయర్ పరిస్థితిపై కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సంగిలితో ఎప్పటికప్పుడు చర్చలు చేస్తూనే ఉన్నానని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలని స్పస్టం చేశాను చెప్పారు. ‘‘సుద్దగడ్డ వాగు సమస్యకు ఇక్కడి ఎమ్మెల్యేగా పూర్తిస్థాయి పరిష్కారం చూపుతాను. గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారు. నష్టపోతున్నారు. ఆ తప్పులన్నింటినీ కూటమి ప్రభుత్వంలో మేము సరి చేయాల్సిన అవసరం ఏర్పడింది’’ అని వివరించారు.

ఎమ్మెల్యే పరిష్కారం చూపుతా..

‘‘సుద్ధగడ్డ వాగు సమస్యకు ఇక్కడి ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతాను. గొల్లప్రోలులో జగనన్న కాలనీ స్థలాలను లోతట్టు ప్రాంతాల్లో కోనేశారు. ఎకరా రూ.30 లక్షల భూమిని రూ.60 లక్షలుగా చూపి కొనుగోలు చేశారు. ఏలేరు రిజవర్వాయర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నాం. వాటిని బట్టి అధికారులకు సూచనలు ఇస్తున్నాం. ప్రజల బాధలు స్వయంగా తెలుసుకోవాలనే ఆరోగ్యం సహకరించకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చాను. వైసీపీ హయాంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం బాధ్యతగా భావిస్తున్నా’’ అని తెలిపారు.

చర్యలకు ముందు మాట్లాడాలి

‘‘బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలి. బుడమేరు ఆక్రమణలు చాలా మంది తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారు. ముందుగా ఆక్రమణలు గుర్తించి అందరితో కలిసి కూర్చుని మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నదీ పరివాహక ప్రాంతాలు వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలి. అనుకోకుండా వచ్చిన భారీ వర్షాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రమంతటా ఈ వర్షాలున్నాయి. వరద విపత్తు నుంచి కోలుకోవడానికి విజయవాడకు కాస్త సమయం పట్టొచ్చు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో కూడా వరదలు విపత్తులు వచ్చిన వేళ కోలుకోవడానికి సమయం పడుతుంది. వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. అధికారులను దగ్గరుండి అప్రమత్తం చేసి అలాగే వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం చొరవ చూపింది’’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News