ఎన్టీఆర్ ట్రస్టుకు పవన్ కల్యాణ్ 50లక్షలు విరాళం
తీర్థయాత్రలు ముగించుకున్న పవన్ కల్యాణ్ విజయవాడ మ్యూజికల్ నైట్‌లో పాల్గొన్నారు.;
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరో సారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టుకు రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం సాయంత్రం యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ ఈవెంట్‌కు టికెట్ కొనమని మా వాళ్లకు చెబితే.. విషయం తెలిసి మీరు టికెట్ కొనక్కర్లేదని భువనేశ్వరి చెప్పారని.. కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారని.. తక్కిని వాళ్లంతా టికెట్లు కొని వస్తే.. నేను మాత్రం ఉత్తిగా రావడం తప్పనిపించింది.. అందుకని నా వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలో ఎన్టీఆర్ ట్రస్టుకు రూ. 50లక్షల విరాళం ఇస్తానంటూ చెప్పుకొచ్చారు.