చిన్నారులకు పోషకాహార కేంద్రాలు
ఏపీలో చిన్నారుల పోషకాహారానికి, పునరావాసానికి 15 కొత్త NRCలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఐదేళ్లలోపు పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపం (SAM – Severe Acute Malnutrition) ఉన్నవారికి ప్రత్యేక చికిత్స, పౌష్టికాహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 15 కొత్త పోషకాహార పునరావాస కేంద్రాలు (NRC – Nutritional Rehabilitation Centers) ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటిల్లో 11 కేంద్రాలు గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త కేంద్రాలతో మరో 115 పడకలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 21 NRCలు – 340 పడకలు ఉండగా, కొత్తవి జోడించగా మొత్తం 36 NRCలు – 455 పడకలు అవుతాయని మంత్రి తెలిపారు.
కొత్త NRCలు ఏర్పాటు చేయబోయే ప్రాంతాలు
10 పడకలతో (8 కేంద్రాలు)
- అల్లూరి సీతారామరాజు – అరకు ప్రాంతీయ ఆసుపత్రి
- అల్లూరి – ముంచింగిపుట్టు CHC
- అల్లూరి – చింతపల్లి CHC
- అనకాపల్లి జిల్లా ఆసుపత్రి
- బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రి
- పల్నాడు – నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రి
- నంద్యాల GGH
- సున్నిపెంట ప్రాంతీయ ఆసుపత్రి
5 పడకలతో (7 కేంద్రాలు)
- పార్వతీపురం మన్యం – సాలూరు ప్రాంతీయ ఆసుపత్రి
- పార్వతీపురం మన్యం – పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రి
- పార్వతీపురం మన్యం – భద్రగిరి CHC
- పార్వతీపురం మన్యం – కురుపాం CHC
- పార్వతీపురం మన్యం – చిన్నమేరంగి CHC
- అల్లూరి – అడ్డతీగల CHC
- అల్లూరి – రామవరం CHC
NRCలో అందే సేవలు
- తీవ్ర పోషకాహార లోపం ఉన్న 0–5 ఏళ్ల పిల్లలకు 14 రోజుల పాటు ఇన్‌పేషెంట్ చికిత్స
- తల్లికి కూడా ఉచిత వసతి, భోజనం
- అధిక పౌష్టికాహారం, వైద్య పర్యవేక్షణ, కౌన్సెలింగ్
- పిల్లల బరువు పెరుగుదల, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది
జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) నిధులతో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.