JUSTICE DELAYED | ఆంధ్ర హైకోర్టులో 2.50 లక్షల పెండింగ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పేరుకుపోతున్న కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రాజ్యసభలో చెప్పిన లెక్కలే ఇందుకు సాక్ష్యం.

Update: 2024-12-25 05:39 GMT
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పేరుకుపోతున్న కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రాజ్యసభలో చెప్పిన లెక్కలే ఇందుకు సాక్ష్యం. ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ పరిమల్ నత్నానీ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి చెప్పిన సమాధానం కక్షిదారులను మరింత కలవరపరుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2,47,097 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, సబార్డినేట్ కోర్టులలో 9,04,462 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ డిసెంబర్ 19, 2024న రాజ్యసభలో ఈ విషయాన్ని చెప్పారు.
సభలో ప్రవేశపెట్టిన మంత్రి ప్రకటన ప్రకారం, భారత సుప్రీంకోర్టులో మొత్తం 82,640 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలోని హైకోర్టులలో 61,80,878 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలోని జిల్లా, సబార్డినేట్ కోర్టులలో 4,62,34,646 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
మంత్రి ప్రకటన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంజూరు చేయబడిన 37 న్యాయమూర్తుల పోస్టులకు గాను మొత్తం 08 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా, సబార్డినేట్ కోర్టులలో మంజూరు చేయబడిన 623 పోస్టులకు గాను 59 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశంలోని మొత్తం 1,122 న్యాయమూర్తులకు గాను మొత్తం 368 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశంలోని జిల్లా, సబార్డినేట్ కోర్టులలో మొత్తం 25,741 న్యాయమూర్తుల పోస్టులకు 5,262 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తుల మంజూరు సంఖ్యకు గాను ఒకే ఒక న్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉంది.
Tags:    

Similar News