గత హైదరాబాద్ ప్రభుత్వాలకు చంద్రబాబు ప్రశంస

జగన్ తప్ప ఇతర ముఖ్యమంత్రులంతా నేను ప్రారంభించిన దాన్ని ముందుకు తీసుకెళ్లారు...

By :  Admin
Update: 2024-08-05 06:49 GMT

 సోమవారం అమరావతిలోని  సచివాలయంలోని 5 వ నేడు మొదలయిన  తొలి కలెక్టర్ల  భేటీలో  సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ  గత ప్రభుత్వాలను ప్రశంసించారు.

నేడు జరుగుతున్న కాన్పరెన్స్ చరిత్రాత్మకమైన కాన్ఫరెన్స్ అని, చరిత్ర తిరగ రాయబోతోందని చెబుతూ 1995లో తాను   హైదరాబాద్‌లో  ఇన్వెస్టు మొంట్లను ఆకట్టుకునేందుకు  బెస్ట్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేశానని,  న్ని తరువాత వచ్చిన ముఖ్యమంత్రులంతా దాన్ని కొనసాగించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

పరోక్షంగా ఆయన  1995 తర్వాత వచ్చిన తెలుగుదేశమేతర ప్రభుత్వాలన్నింటిని ప్రశసించినట్లే లేక్క.  ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, రోశయ్య,  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలతో పాటూ తర్వాత వచ్చిన  టిఆర్ ఎస్  ప్రభుత్వాలను ప్రశంసించినట్లే లెక్క. 2019-204 మధ్య  అమరావతి నుంచి  పరిపాలించిన ఒక్క ప్రభుత్వమే అంటే జగన్ ప్రభుత్వమే తాను ప్లాన్ చేసిన అమరావతి ని ముందుకు తీసుకెళ్లలేదని ఆయన చెప్పకనే చెప్పారు. గత అయిదేళ్ల పాలనను ఆయన  జనగ్ పేరు పెట్టకుండా విమర్శించారు.

"గత అయిదేళ్లలో ఎన్నివిధాల ఇబ్బందులు పడ్డామో అన్ని విధాలా భాదింపబడ్డామో  ఎన్నికల్లో పునర్‌నిర్మాణం చేస్తామని పవన్ కళ్యాణ్, తాను హమీ ఇచ్చామని దానిని ప్రజలు విశ్వసించారు," అని అన్నారు.   ఈ రాష్ట్రం దశ దిశను సూచించేదిగా ఈ కలెక్టర్ కాన్పరెన్స్ ఉంటుందని చెబుతూ  ప్రజా వేదిక ఉండి ఉంటే అక్కడే  ఈసభని పెట్టేవాళ్లమని, బయట ఎక్కడో ఏర్పాటు చేయడం ఇష్టం లేక సచివాల యంలో పెట్టామని  చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో ఒక్కసారి కూడా కలెక్టర్ కాన్ఫురెన్స్ పెట్టలేదంటే ఎంతదారుణమో అర్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.


అయిదేళ్లకు ముందు ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతానని అన్న విషయాన్ని గుర్తు చేశారు.  గతంలో తాను సీఎం అయినప్పడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, అయితే ఇప్పుడు మాత్రం ఆఫీసర్లలో మోరల్ దెబ్బతిన్నదని,  రాష్ట్రానికి  ఉన్న బ్రాండ్ ఏపీ  ఇమెజ్ కూడా దెబ్బతిన్నదని, అధికారుల మనోభవాలను దెబ్బతీసారని ఆయన అన్నారు.

సభలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.




ఢిల్లీకి ఇక్కడి నుంచి వెళ్లిన ఐఎఎస్ అధికారులు  కేంద్రంలో, ఆర్‌బీఐలో చాలా కీలకం అయ్యారని, వరల్డ్ బ్యాంకులో కూడా పనిచేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

"చిన్న తప్పు జరిగితే దాన్ని సరిచేయెచ్చు. అయితే విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎంతో ప్రయత్నం చేయక తప్పదు. తాను మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పడు కరెంటులేని గ్రామాలు ఉన్నాయని, ఇప్పుడు డ్రైవర్ లెస్ కార్లు వచ్చేశాయి. గతంలో ఆర్ధిక సంస్కరణలు వచ్చాక కాంపిటేటివ్ ఎకానిమీగా పోటీ పడ్డాము  2029కి మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ గట్టిగా పనిచేస్తే 2047 నాటికి మొదటి స్ధానంలోకి వెళుతాము.  మనం గణితంలో ఎంతో ముందున్నామని, బ్రిటిష్ వారు ఇంగ్లీష్‌ను వదిలి పెట్టిపోయారు.  ఈ రెండు ఐటికి డెడ్లీ కాంబినేషన్ దాన్ని అందిపుచ్చుకున్నాము," అని అన్నారు.


Tags:    

Similar News