‘డీబీటీ నిధులతో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు’
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంత్రి సవిత వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. గత ప్రభుత్వం డీబీటీ ద్వారా ఇచ్చిన డబ్బులతో మహిళలు గంజాయి, మందుకు అలవాటు పడ్డారని తీవ్ర సంచల వ్యాఖ్యలు చేశారు. కాపులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు స్వయం ఉపాధి లేక పోవడం వల్ల, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ లేక పోవడం వల్ల ఎలా తయారయ్యాంటే.. గత ప్రభుత్వం ఇచ్చిన డీబీటీ నిధులతో గంజాయికి, మందుకి అలవాటు పడ్డారని, ప్రత్యేకించి మహిళలు వీటికి అలవాటు పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్క సారిగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు లేచారు. మంత్రి సవిత వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరకరం తెలిపారు. బాధ్యతాయుతమైన బీసీ మంత్రిగా ఉండి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మేషేన్ రాజు కూడా మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మహిళా మంత్రి అయ్యుండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.