మహిళా సాధికారతకు MEPMA కొత్త కార్యక్రమాలు
పేదరిక నిర్మూలనకు ఎనిమిది కొత్త కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించింది. ఈ కార్యక్రమాలు మెప్మా ద్వారా అమలు చేస్తారు.
ఏపీలోని మహిళల్లో లక్ష మందిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన సమాచార పుస్తకాలు ప్రభుత్వం రూపొందించింది. పట్టణ పేదరిక నిర్మూలనా పథకం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాల ద్వారా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా రాణించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఎనిమిది కొత్త కార్యక్రమాలు ప్రభుత్వం రూపొందించింది.
రూ. 1.25 కోట్ల చెక్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు
"1 లక్ష మహిళా పారిశ్రామికవేత్తల కార్యక్రమం" పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఇటీవల ప్రారంభించారు. MEPMA ద్వారా అమలు చేసేందుకు రూపొందించిన ఎనిమిది వినూత్న కార్యక్రమాలు కాబోయే మహిళ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శకం కానున్నాయి. ఈ కార్యక్రమాలు మహిళా సాధికారత, డిజిటల్ శిక్షణ, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించారు.
కొత్త కార్యక్రమాల వివరాలు
1. Mana Mithra APP ద్వారా WhatsApp సేవలు: స్వయం సహాయక బృందాల (SHG) సభ్యులకు పారదర్శకంగా సమాచారం అందించేందుకు Mana Mithra APP ద్వారా తొలిసారిగా WhatsApp సేవలను ప్రభుత్వం అందిస్తోంది. SHG పొదుపు, అప్పు వివరాలు, SLF/TLF/ZUS సభ్యుల వివరాలు, ఆడిట్ నివేదికలు, MEPMA సిబ్బంది వివరాలు, Pragnya Virtual Training Academy సమాచారాన్ని ఈ యాప్ ద్వారా సభ్యులు పొందవచ్చు.
వాట్సాప్ గవర్నెన్స్ లో వివరాలు సీఎం కు తెలుపుతున్న అధికారులు
2. Pragnya Virtual Training Academy: AI ఆధారిత ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌గా రూపొందిన ఈ అకాడమీ, SHG సభ్యులకు డిజిటల్, ఫైనాన్షియల్ లిటరసీతో సహా 12 రకాల కోర్సులను ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. సభ్యుల చురుకుదనం, అవగాహన స్థాయిని బట్టి సర్టిఫికేట్‌లు అందించబడతాయి.
3. MEPMA ప్రగతి మాగజైన్: MEPMA సాధించిన ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రగతిని వివరించే మాగజైన్‌ను ప్రారంభించారు.
4. AVANEE బ్రాండింగ్ మాన్యువల్: SHG ఉత్పత్తులను ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఏకరీతిగా బ్రాండింగ్, ప్యాకేజింగ్ చేయడానికి ఈ మాన్యువల్ రూపొందించారు.
5. LHP సెల్ ప్రచార పుస్తకం: పట్టణాల్లో SHG సభ్యులకు వివిధ జీవనోపాధి అవకాశాలను తెలియజేసేందుకు ఈ పుస్తకం రూపొందించారు.
మహిళా విజయ గాధల పుస్తకం రిలీజ్
6. ప్రేరణ సఖి పుస్తకం: SHG సభ్యులలో అత్యున్నత వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళల విజయ గాథలను ప్రచురించి, ఇతర సభ్యులకు ప్రేరణ కలిగించేందుకు ఈ పుస్తకం తయారు చేశారు.
7. LEAP పుస్తకం: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మునిసిపాలిటీలలో India SME Forum ద్వారా నిర్వహించిన జీవనోపాధి ఆడిట్ వివరాలను ప్రదర్శించే పుస్తకం.
8. PMFME జంబో చెక్ ప్రదానం: ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) పథకం కింద, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌కు చెందిన SHG లబ్ధిదారైన శ్రీమతి మాధురికి డెయిరీ యూనిట్ అభివృద్ధికి రూ. 1.25 కోట్ల రుణానికి సంబంధించిన జంబో చెక్‌ను ముఖ్యమంత్రి అందజేశారు.
ఈ కొత్త కార్యక్రమాలు మహిళా సాధికారత, పట్టణ పేదరిక నిర్మూలన, స్థిరమైన జీవనోపాధి ప్రోత్సాహానికి MEPMA నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. డిజిటల్ శిక్షణ, బ్రాండింగ్, ఆర్థిక సహాయం ద్వారా SHG మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యం. ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్యను 1 లక్షకు చేర్చే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు.