ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.;
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెలవులో ఉన్న సౌరబ్ గౌర్ కు పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారంతా ఏదో ఒక శాఖలో పనిచేస్తున్నారు. కొంత మందికి వేరే శాఖలను అదనపు బాధ్యతగా ఇచ్చారు.
ముఖేష్ కుమార్ మీనా ను సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) కార్యదర్శి గా నియమించారు. జీఏడీ (సర్వీసెస్), ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగానూ కొనసాగుతారు.
కె సునీత ను పబ్లిక్ ఎంటర్ ముఖ్య కార్యదర్శి గా నియమించారు. ప్రస్తుతం ఆమె పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఎస్ సురేశ్ కుమార్ ను పురపాలక, పట్టనాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గా నియమించారు. ప్రస్తుతం ఐఅండ్ఐ లో కార్యదర్శి గా ఉన్నారు.
సౌరబ్ గౌర్ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నారు. కాటమనేని భాస్కర్ ను ఆర్టీజీఎస్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి, పాఠశాల అదనపు సౌకర్యాల శాఖ అదనపు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
వి కరుణ ను సెర్ప్ సీఈఓగా, ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆయన వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా ఉన్నారు.
ఎంఎం నాయక్ ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ గిరిజన సంక్షేమ శాఖ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పశు సంవర్థక, మత్స్య శాఖ ల కార్యదర్శిగా ఉన్నారు.
ప్రవీణ్ కుమార్ కు మైనింగ్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఏపీఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్నారు.
కె కన్నబాబు ను సీఆర్డీఏ కమిషనర్ గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉంటూ గిరిజన సంక్షేమ శాఖ కు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఎంవీ శేషగిరిరావు ను కార్మిక శాఖ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ ల శాఖ ఐజీగా ఉన్నారు.
ఎస్ సత్యనారాయణ ను బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ఈడబ్ల్యుఎస్ శాఖ కు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం దేవదాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వాడ్రేవు వినయ్ చంద్ ను దేవదాయ శాఖ కార్యదర్శిగా నియమించి, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
జి వీరపాండ్యన్ కు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గా నియమించారు. ప్రస్తుతం ఆయన సెర్ప్ సీఈవో, ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఉన్నారు.
హరినారాయణ్ కు స్టాంపులు, రిజిస్ట్రేషన్ ల శాఖ ఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పురపాలక శాఖ డైరెక్టర్ గా ఉన్నారు.
గిరీశా పీఎస్ ను ఏపీఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ గా నియమించారు. స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
పి రవిసుభాష్ ను ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో గా నియమించారు. ప్రస్తుతం ఆయన మధ్య ప్రాంత విద్యత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ గా ఉన్నారు.
పి సంపత్ కుమార్ ను పురపాలక శాఖ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన గేటర్ విశాఖపట్నం మునిసిపల్ కమిషనర్ గా ఉన్నారు.
వి అభిషేక్ ను పోలవరం (భూ సేకరణ, పునరావాసం) ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు. ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉన్నారు.
జి సాయిప్రసాద్ ను ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దీనికి అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
పీయూష్ కుమార్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ముఖ్య మంత్రి కి ముఖ్య కార్యదర్శి గానూ ఉన్నారు. ఈ పోస్టు నుంచి తప్పిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టును అదనపు బాధ్యతగా ఇచ్చారు.