మంగళగిరిలో బుద్ధ పూర్ణిమ వేడుక.. అంతా సిద్ధం చేసిన మానవతా వేదిక

భారతదేశంలోని బౌద్దులు జరుపుకునే అతి తక్కువ వేడుకల్లో బుద్ధ పూర్ణిమ ఒకటి. ఈ పండుగను వారు ప్రతి ఏడాది మే నెలలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకుంటారు.

Update: 2024-05-17 10:10 GMT

భారతదేశంలోని బౌద్దులు జరుపుకునే అతి తక్కువ వేడుకల్లో బుద్ధ పూర్ణిమ ఒకటి. ఈ పండుగను వారు ప్రతి ఏడాది మే నెలలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఆ పండుగను ఈ ఏడాది కూడా మే 23న ఘనంగా నిర్వహించడానికి మానవతా వేదిక సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే 2,568వ బుద్ధ పూర్ణమ వేడుకలను నిర్వహించే సంప్రదాయాన్ని బుద్ధుని బోధనలకు ఆకర్షితులైన రేకా కృష్ణార్జున రావు 25ఏళ్ల క్రితం ‘బౌద్ధ సంఘం’ పేరిట ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన సంఘం కాస్తా కాలక్రమేణా ‘మంగళగిరి బుద్ధ విహార’గా రూపుదిద్దుకుంది. ఆ తర్వాత దీనిని రాష్ట్ర నలుమూలలా వ్యాపింపచేయాలని భావించిన ‘మంగళగిరి బుద్ధ విహార’ ‘బుద్ధ భూమి మాస పత్రిక’ను ప్రారంభించింది.

బుద్ధుని బోధనలు

అడుగడుగా మానవీయ కోణాన్ని స్పృశించేవే బుద్ధుని బోధనలు. అలాంటి భావజాలాన్ని మరింత విస్తృతం చేయాలని రేకా కృష్ణార్జున.. ఇకపై ఇలాంటి కార్యక్రమాలన్నీ మానవతా వేదిక పేరిట జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈకార్యక్రమ బాధ్యతల నిర్వహణకు ప్రగతిశీల కవి కన్వీనర్ గోలి మధు స్వీకరించారు. దాంతో మానవతా వేదికకు మధు కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. ఈ వేడుకల నిర్వహణను పర్యవేక్షించడానికి 20మందికి పైగా బౌద్ధ అభిమానులతో ఓ కమిటీ ఏర్పడింది. 

ఈ నెలలో జరిగే 2,568వ బుద్ధ పూర్ణిమ వేడుకలో మంగళగిరి బుద్ధ రోడ్డులోని వైష్ణవి కళ్యాణ మండపంలో సాయంత్ర 6 గంటలకు రేకా కృష్ణార్జున ఆధ్వర్యంలో వైభవంగా జరగనున్నాయని మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు వెల్లడించారు.

బుద్ధ పూర్ణిమ ప్రాముఖ్యత

బుద్ధ పూర్ణిమ ప్రాముఖ్యతను నాలుగు విభాగాలుగా చెప్పవచ్చు. అవి జననం, బోధి(జ్ఞానోదయం), ధర్మం, పరినిర్వాణం(ఉత్తీర్ణత). అవేంటంటే..

జననం

పురాణాల ప్రకారం బుద్ధుని జననంతోనే ఆయన భవిష్యత్తును తెలిపే సంకేతాలు వచ్చాయి. ఓ పండితుడు గౌతముడు(బుద్ధుడు) అయితే పరాక్రమవంతుడు లేదా సన్యాసి అవుతాడని చెప్తారు. అదే విధంగా గౌతముడు తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలతో ఒక కొత్త శకానికి నాంది పలికారు. మానవాళికి జ్ఞానోదయాన్ని కలిగించాడు.

జ్ఞానోదయం

బుద్ధి పూర్ణిమ నాడు స్మరించుకునే అత్యంత కీలక ఘటనల్లో బుద్ధునికి జ్ఞానోదయం కావడం ప్రథమంగా ఉంటుంది. ఏళ్ల తరబడి కఠినమైన ధ్యానం, ఆధ్యాత్మిక అన్వేషణ తర్వాత సిద్ధార్థ గౌతమ.. బోధ్ గయలోని బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. ఆయన జ్ఞానోదయం మానవ సాధన పరాకాష్ట స్థాయికి నిదర్శనం. అంతిమ సత్యానికి మేల్కొలుపు, జన్మ, పునర్జన్మ చక్రం నుంచి విముక్తి.

ధర్మం

బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధుని తొలి ఉపన్యాసాన్ని కూడా స్పరించుకుంటారు. దానినే ధమ్మచక్కప్పవట్టన సూత్రం లేదా ధర్మ చక్రం చలనంలో ఉంచడం అని పిలుస్తారు. ఆ ఉపన్యాయంలో బుద్ధుడు నాలుగు సత్యాలను వివరించారు. అవి బాధలోని సత్యం, బాధకు కారణం, బాధల విరమణ, బాధల విరమణ మార్గం. ధర్మం అనేది మానవ స్థితిపై లోతైన అంతర్దృష్టులను అందిస్తుంది.

పరినిర్వాణం

బుద్ధ పూర్ణిమ వేడుకల్లో పరినిర్వాణగా చెప్పుకునే ఆయన వర్ధంతిని కూడా తలుచుకుంటారు. ఈ పరినిర్వాణం బాధలను అధిగమించడం, అంతిమ శాంతి, విముక్తిని పొందడాన్ని సూచిస్తుంది. ఇది జీవితం అశాశ్వత, మరణ అనివార్యతను గుర్తు చేస్తుంది. ప్రస్తుత క్షణంలో జ్ఞానం, ధర్మాన్ని పెంచుకోవాలని సూచిస్తుంది.

Tags:    

Similar News