ఈ జిల్లాలో తక్కువ పోలింగ్
అన్ని జిల్లాల కంటే తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో నమోదైంది.
By : Vijayakumar Garika
Update: 2024-05-13 15:10 GMT
రాష్ట్రంలో తక్కువ ఓట్లు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలయ్యాయి. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఈ జిల్లాలో పోలింగ్ జరిగింది. సమస్యాత్మక జిల్లాగా ప్రకటించడం వల్ల ఐదు గంటలకు ఎన్నికలు ముగిసాయి. 55.17 శాతం ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో జరిగిన పోలింగ్ పర్సెంటేజీలో ఈ జిల్లా అన్ని జిల్లాల కంటే తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. దీని తరువాత విశాఖ జిల్లాలో 57.42 శాతం పోలింగ్ నమోదై రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లా పూర్తి స్థాయిలో ఏజెన్సీలో ఉండటం వల్ల గిరిజనులకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక సకాలంలో హాజరు కాలేకపోయారు. వయసు మీరిన కొందరు డోలీలతో ఓట్లు వేయడానికి వచ్చారు. అధికారుల నుంచి పూర్తి సహకారం లేదని గిరిజనులు తెలిపారు.