పవన్ సవాల్ కు లోకేష్ సై..
విద్యాశాఖ ద్వారా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటుతామన్న మంత్రి లోకేష్;
డిప్యూటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ ను రాష్ట్ర మంత్రి లోకేష్ స్వీకరించారు.అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. ఇప్పుడా సవాల్ ను విద్యాశాఖామంత్రిగా లోకేష్ స్వీకరించారు.విద్యాశాఖ ద్వారా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటుతామని నారా లోకేశ్ ప్రకటించారు.శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం-2.0 సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు హాజరైన లోకేశ్ మొక్కలు నాటడంలో పవన్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామని తెలిపారు.