ఇది ఫిక్స్..జైలు తర్వాతే కేటీఆర్ పాదయాత్ర

తాను ముందుగా జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే పాదయాత్ర ఉంటుందన్నారు.

Update: 2024-11-08 08:40 GMT

ఒక విషయంలో క్లారిటీ వచ్చేసింది. అదేమిటంటే జైలుకెళ్ళిన తర్వాతనే కేటీఆర్ పాదయాత్ర(KTR Padayatra) ఉండబోతోందని. తొందరలోనే తాను తెలంగాణా(Telangana) వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు స్వయంగా కేటీఆర్(KTR) ప్రకటించిన విషయం తెలిసిందే. పాదయాత్ర చేస్తాను అన్నారే కాని ఎప్పుడు మొదలుపెడతారు ? ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగిస్తారన్న విషయాన్ని కేటీఆర్ చెప్పలేదు. దీంతో కేటీఆర్ ప్రకటించిన పాదయాత్ర విషయంలో పార్టీలోని నేతల్లో రకరకాల కాంబినేషన్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం ఇలాగుండగానే తాజాగా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతు తాను ముందుగా జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే పాదయాత్ర ఉంటుందన్నారు. కేటీఆర్ ముందు జైలుకు వెళ్ళటం ఏమిటి ? తర్వాత పాదయాత్ర చేయటం ఏమిటని అయోమయంలో పడ్డారా ?

మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఫార్ములా 1 కార్ రేసింగ్(Formula 1 Car Racing) కుంభకోణం జరిగిందని చెప్పి తనను అరెస్టుచేయటానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు ఆరోపించారు. ఫార్ములా వన్ కార్ రేసింగ్ లో రు. 55 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు బాగా వినబడుతున్నాయి. దీనికి సంబందించి ఇప్పటికే అప్పట్లో కుంభకోణంలో ముఖ్యపాత్ర పోషించిన నాటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, హెడ్ఎండీఏ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను ఏసీబీ విచారిస్తోంది. కేటీఆర్ నోటిమాటగా ఇచ్చిన ఆదేశాల కారణంగానే తాను రు. 55 కోట్లు విదేశీకంపెనీకి బదిలీచేసినట్లు అర్వింద్ వాగ్మూలం ఇచ్చారు. దాంతో రు. 55 కోట్ల కుంభకోణంలో కేటీఆర్ కీలక పాత్రదారుగా ప్రభుత్వం, ఏసీబీ అనుమానిస్తోంది. అందుకనే కేటీఆర్ పై కేసు నమోదు చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor JishnuDev Varma)కు ప్రభుత్వం లేఖ రాసినట్లు ప్రచారంలో ఉంది. గవర్నర్ అనుమతి ఇవ్వటమే ఆలస్యం వెంటనే కుంభకోణాన్ని విచారిస్తున్న ఏసీబీ(ACB) కేటీఆర్ పైన కేసుపెట్టి విచారించేందుకు రెడీగా ఉంది.

కేసు, విచారణ తర్వాత కేటీఆర్ అరెస్టు తప్పదనే ప్రచారం విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు తనను అరెస్టుచేయటానికి ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పారు. తాను కూడా అరెస్టుకు సిద్ధంగానే ఉన్నట్లు చెప్పారు. తాను అరెస్టుకాగానే జైలుకు వెళ్ళి బాగా ట్రిమ్మయి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని ప్రకటించారు. దాంతో ముందు జైలుయాత్ర తర్వాతే కేటీఆర్ పాదయాత్ర ఉంటుందనే ప్రచారం విపరీతంగా పెరిగిపోతోంది. కేటీఆర్ ఏమో అసలు కుంభకోణమే జరగలేదని సమర్ధించుకుంటున్నారు. ఇదే సమయంలో కేటీఆర్ నోటిమాట ఆధారంగానే తాను విదేశీకంపెనీకి రు. 55 కోట్లు చెల్లించినట్లు అర్వింద్ చెప్పారు. కేటీఆర్ కూడా జరిగిన ఘటనలో అర్వింద్ తప్పేమీలేదని తాను చెబితేనే నిధుల బదిలీ జరిగిందని అంగీకరించారు.

ఇక కుంభకోణం జరిగిందా లేదా అన్న విషయాన్ని ఏసీబీ విచారణలో తేలుస్తుంది. ఆ తర్వాత కోర్టులో విచారణ ఎలాగూ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేటీఆర్ అరెస్టు ఎప్పుడాని మాత్రమే. గవర్నర్ ఆమోదం తెలపటమే ఆలస్యం అన్నట్లుగా ప్రభుత్వం కాచుకుని కూర్చున్నట్లుంది. ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News