భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావుపై తొలి తెలుగు పుస్తకం

వర్ధమాన జర్నలిస్టులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. విలువలతో ఎలా పని చేయాలో నేర్పుతుంది.

By :  Admin
Update: 2024-12-22 14:49 GMT

భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పుస్తకావిష్కరణ సభ మిర్యాల వెంకట్రావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ యూసఫ్‌ గూడ మహమ్మద్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో మేఘాలయ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ కొట్టు శేఖర్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆకుల అమరయ్య ఇతర జర్నలిస్టులు చందుజనార్ధన్, రామమోహన నాయుడు, సమ్మెట నాగమల్లేశ్వరరావు తదితరులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పుస్తక రచయిత అమరయ్య మాట్లాడుతూ..జర్నలిజంలో నైతికత విలువలకు కట్టుబడిన భారతీయ జర్నలిస్టులలో మానికొండ చలపతిరావు ఒకరని కొనియాడారు. పద్మ భూషణ్‌ అవార్డును కూడా మానికొండ చలపతిరావు తిరస్కరించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇది తెలుగులో వచ్చిన ఏకైక పుస్తకమని, భారతీయ వర్ధమాన జర్నలిస్టులకు ఇది ఎంతో ఉపయోగిపపడుతుందని చెప్పారు. మానికొండ చలపతిరావు జీవిత చరిత్ర, జర్నలిజం విలువల గురించి ప్రముఖులు అనేకమంది రాసిన దాదాపు 30 వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ సభకు ఆంధ్రప్రదేశ్‌ సామాజిక న్యాయ విశ్లేషకులు కటారి అప్పారావు, అరవ రామకృష్ణ, మాజీ ఐఏఎస్‌ అధికారి తోట గోపాలకృష్ణ, సీనియర్‌ జర్నలిస్టులు పాశం యాదగిరి, రామ్మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం మానికొండ చలపతి పుస్తక రచయిత ఆకుల అమరయ్యను సన్మానించారు.

Tags:    

Similar News