విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు జోగి సోదరులు

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును అరెస్టు చేశారు.

Update: 2025-11-03 12:47 GMT

నకిలీ మద్యం రాకెట్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రామును విజయవాడ సెంట్రల్ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. భద్రతా కారణాల రీత్యా జోగి సోదరులను విజయవాడ జైలు నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు ఆయనతో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా అరెస్టు చేశారు. అదే రోజు సాయంత్రం తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జోగి రమేశ్‌ను, జోగి రామును సుమారు 12 గంటల పాటు సుదర్ఘ విచారణ చేపట్టారు. రమేష్ ను ఆయన సోదరుడు రామును వేర్వేరుగా సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసు ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దనరావుతో జోగి రమేశ్‌కు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, రూ. 3 కోట్లకు పైగా నిధుల సహాయం అందించినట్టు ఆరోపణలపై ఆరా తీశారు.

వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఎక్సైజ్ అధికారులు, పోలీసులు జోగి రమేశ్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు ప్రారంభమై, తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగింది. విచారణ అనంతరం  న్యాయమూర్తి ఈ నెల 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో తొలుత వారిద్దర్నీ విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించగా, తాజాగా భద్రతా కారణాల రీత్యా నెల్లూరు సెంట్రల్ జైలుకు మార్చారు.మరో వైపు  SIT దర్యాప్తు కొనసాగుతోంది, జోగి రమేశ్ ఇంటి నుంచి సీజ్ చేసిన CCTV ఫుటేజ్, హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News