ఆదివాసుల రక్షణే మానవాళికి రక్షణ

"ప్రపంచంలో అన్నిచోట్ల అభివృద్ధి, ఆధునికత పేరుతో జరుగుతున్నదంతా పకృతి, మానవాళి విధ్వంసం,వినాశమే."

By :  Admin
Update: 2024-08-09 15:19 GMT

సదస్సులో ప్రసంగిస్తున్న శ్రీనివాస్ మలసాని. వేదికపై వైస్ ఛాన్స్ లర్ మురళీకృష్ణ, ఓఎస్డీ కోటేశ్వరరావు, ఎల్. ఓ. కుమారస్వామిలు ఉన్నారు.


ఆదివాసుల(గిరిజనులు) సంస్కృతి,భాష,జీవనం, హక్కుల పరిరక్షణతోనే సకల మానవాళి రక్షణ ముడిపడి ఉందని ప్రముఖ ప్రీలాన్స్ జర్నలిస్టు మలసాని శ్రీనివాస్ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, కాకినాడ (JNTUK) ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ యూనివర్సిటీ సెనెట్ హాల్ లో 'ప్రపంచ ఆదివాసి దినోత్సవం' జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన మలసాని మాట్లాడుతు ఆదివాసుల దినోత్సవం జరుపుకోవటం ఆదివాసుల ఉద్ధరణ కోసమేననే భావన సరికాదన్నారు. ఆదివాసుల రక్షణ జరిగితేనే అడవుల రక్షణ, జీవవైవిధ్యం రక్షణ, పర్యావరణలను పరిరక్షించుకోగలమని మలసాని పేర్కొన్నారు. పకృతి అంటేనే భిన్నత్వం, వైవిధ్యమని, ఆ పకృతి ప్రతిఫలనే మానవ సమాజమని, ఇప్పుడు ఈ పకృతిని, భిన్నత్వం గల సమాజాన్ని ఆధునిక నాగరికత, అభివృద్ధి పేరుతో కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం విధ్వంసం చేస్తున్నారని మలసాని విశ్లేషించారు.



ప్రపంచంలోని అన్నిచోట్ల అభివృద్ధి, ఆధునికత పేరుతో జరుగుతున్నదంతా పకృతి, మానవాళి విధ్వంసం,వినాశమని ఆయన అన్నారు. ఇప్పుడు అభివృద్ధిగా, సౌకర్యాల పేరిట సాగుతున్నదంతా లక్షల కోట్ల రూపాయల సంపాదన మాత్రమేనన్నారు. ప్రజలు చైతన్యంతో ఈ వినాశకర విధానాలను ఎదుర్కోవాలని, ఆ దిశగా జనానికి వాస్తవాలను ఎరుకపర్చాల్సిన బాధ్యత ఈ తరం విద్యావంతులు, బుద్ధిజీవులపై ఉందని మలసాని అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సుకు యూనివర్శిటీ రెక్టార్ ప్రొఫెసర్ మురళీ అధ్యక్షత వహించారు. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కె.వి.వి.జి. గోపాలకృష్ణ సదస్సు లక్ష్యాలను వివరించారు. సదస్సును యూనివర్సిటీ లైజాన్ ఆఫీసర్ కుమారస్వామి సదస్సు ప్రాధాన్యత చెప్పారు. చార్వక బొజ్జా వందన సమర్పణ చేశారు.


Tags:    

Similar News