జనసేన కల నెరవేరింది
2014లో పార్టీ పెట్టినా రాజకీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. 2024 ఎన్నికలు జనసేనను మలుపు తిప్పాయి.;
ఎట్టేకేలకు జనసేన కల నెరవేరింది. అంతకుముందు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు అనుకోకుండా అన్నీ కలిసొస్తున్నాయి. కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య పొత్తులు కుదర్చడంలోను పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడంలోను ముఖ్య భూమిక పోషించారు. దీంతో అటు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇటు పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవడంలోను పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. దీంతో కేంద్రంలో బీజేపీకి స్థానాల సంఖ్య తగ్గినా.. రాష్ట్రంలో ఎన్డీఏకి అందులో భాగస్వామ్య పార్టీలకు వచ్చిన సీట్లే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ పోశాయి.