జగన్‌ నెల్లూరు పర్యటన..భారీగా కేసులు నమోదు

నిబంధనలు ఉల్లంఘించి, ఆంక్షలను మీరారనే కారణంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.;

Update: 2025-08-01 08:05 GMT

వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా ఆ పార్టీ నాయకుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంక కలిగించారనే కారణంతో వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు. ఎవరినైతే పరామర్శించేందుకు జగన్‌ వెళ్లారో ఆ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

గురువారం వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన చేశారు. ఈ సందర్భంగా 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉండగా నిబంధనలను ఉల్లంఘించారని, నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేపట్టారని, రోడ్లపైన భైఠాయించారని, బారికేడ్లను తోసేశారని ప్రసన్నకుమార్‌రెడ్డి, బొబ్బల శ్రీనివాస్‌ యాదవ్, పాతపాటి ప్రభాకర్‌లపైన నెల్లూరు దర్గామిట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో వైపు తాము పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారమే ప్రవర్తించామని, నిబంధనలను తామేమీ ఉల్లంఘించలేదని, కావాలనే తమపై కేసులు నమోదు చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
జగన్‌ తన నెల్లూరు జిల్లా పర్యటనలో నెల్లూరు జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ, సీనియర్‌ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో ములాఖత్‌ అయ్యారు. అక్కడ నుంచి మరో వైసీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో పరామర్శించేందుకు ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికెళ్లి జగన్‌ వెళ్లారు. అయితే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి సమీపంలో జగన్‌ కోసం భారీగా వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ లాఠీచార్జ్‌ చోటు చేసుకుంది. దీనికి నిరసనగా ప్రసన్నకుమార్‌రెడ్డి రోడ్డుపై భైఠాయించి ధర్నా చేపట్టారు. ఆంక్షలు అమలులో ఉండగా ఇలా రోడ్డుపై భైఠాయించి నిబంధనలు ఉల్లంఘించారని, బీ శ్రీనివాస్‌ యాదవ్, పాతపాటి ప్రభాకర్‌లపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్‌ ర్యాలీలు నిర్వహించారని మరి కొందరిపైన పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది.
మరో వైపు ఇది వరకు కూడా జగన్‌ పర్యటనలు చేపట్టిన ప్రాంతాల్లో నిబంధనల ఉల్లంఘించారనే కారణంతో పలువురు వైసీపీ నాయకులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. గుంటూరు పర్యటనతో పాటు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటన, పొదిలి పర్యటన, పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యనల సందర్భంగా ఆ ప్రాంతాల వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు.


Tags:    

Similar News