జగన్‌ మారడు..మారలేడు..ఇక డిస్కషన్‌ ఓవర్‌

ఎమ్మెల్యే సోమిరెడ్డి చెప్పిన ఈ డైలాగ్‌ రక్తచరిత్ర సినిమాలోని ఓ డైలాగ్‌ను తలపిస్తోంది.;

Update: 2025-07-17 06:50 GMT

పరిటాల రవి జీవిత వృత్తాంతం ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రక్తచరిత్ర సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర పోషించిన ప్రముఖ నటుడు శత్రుఘ్నసిన్హా చేత ‘టాపిక్‌ ఈజ్‌ ఓవర్‌’ అంటూ ఓ డైలాగ్‌ చెప్పిస్తాడు. ఎన్టీఆర్‌ పాత్రలో జీవించిన శత్రుఘ్నసిన్హా ఆ డైలాగ్‌ చెప్పే సమయంలో పలికించిన హావభావాలు కానీ, ఆ డైలాగ్‌ డెలివరీ విధానం కానీ, ఆ సయంలో అతని చేత పలికించిన మేనరిజమ్స్‌ కానీ ప్రేక్షకులను రక్తి కట్టించింది. అంటే ఆ టాపిక్‌ అంతటితో క్లోజ్‌ అయిపోయింది.. ఇక దాని గురించిన ప్రస్తావన లేదు అనే వాతావరణం ఎస్టాబ్లిష్‌ చేయడానికి ఆ సీన్‌ను క్రియేట్‌ చేశారు.

నిజంగా నిజ జీవితంలో ఎన్టీఆర్‌ అలా చెప్పేవారో తెలియదు కానీ.. రక్తచర్రిత సినిమాలో రామ్‌గోపాల్‌ వర్మ ఎన్టీఆర్‌ పాత్రలోని శత్రుఘ్నసిన్హా చేత చెప్పించి మెప్పించిన తీరుకు అటు ఎన్టీఆర్‌ అభిమానులు ఇటు పరిటాల రవి ఫాలోవర్స్‌ కానీ.. టోటల్‌గా టీడీపీ శ్రేణులు తెగ సంబరపడ్డారు. ఇది ఎందుకు ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. సరిగ్గా ఇంచుమించు ఇలాంటి డైలాగే ఆంధ్రప్రదేశ్‌లోని సీనియర్‌ నాయకుడు, టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పలికారు.

రక్తచరిత్రలో టాపిక్‌ ఈజ్‌ ఓవర్‌ అంటే.. డిస్కషన్‌ ఈజ్‌ ఓవర్‌ అంటూ సోమిరెడ్డి పలికారు. అంటే ఇక్కడ కూడా జగన్‌ గురించి డిస్కషన్‌ అనవసరం అనే మీనింగ్‌లో సోమిరెడ్డి ఆ డైలాగ్‌ను పలికినట్టు ఉన్నారు. బుధవారం జగన్‌ ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టారు. పద్ధతి మార్చుకోకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ అందులో సీఎం చంద్రబాబుకు, టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి ఓ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దీనిపైన సోమిరెడ్డి రెస్పాండ్‌ అయ్యారు.

ఇంతకు సోమిరెడ్డి ఏమన్నారంటే..
ఏడాది కాలంగా జగన్‌మోహన్‌రెడ్డి పోకడలు, ఆలోచనలు చూసిన తర్వాత, ఈ రోజు(బుధవారం) అతని ప్రెస్‌ మీట్‌ చూశాక రెండు విషయాల్లో అందరికీ పూర్తి క్లారిటీ వచ్చింది. జగన్‌రెడ్డికి 2024లో వచ్చిన ఓటమి ఇంకా అర్థం కాలేదు. ప్రజల తీర్పును అర్ధం చేసుకోలేదు. జగన్‌ మారలేదు.. మారలేడు.. 2029లో కూడా గెలవలేడు.. అని పేర్కొంటూ.. ఇక డిస్కషన్‌ ఈజ్‌ ఓవర్‌ అని సినిమా స్టైల్‌లో డైలాగ్‌ పలికారు. ఇంకా తన టాక్‌ను కొనసాగిస్తూ.. వైసీపీ నేతలు వేరే దారి చూసుకోండి.. కార్యకర్తలు ఆశలు వదులుకోండి అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు సలహా ఇచ్చారు. అయితే తనకు సంబంధించిన విషయం కాబట్టి, దాని మీద తనకు తాను ఎలా అయినా నిర్ణయం తీసుకునే అధికారం తనకు ఉంది కాబట్టి ఎన్టీఆర్‌ పాత్రలో వర్మ అలా రక్తచరిత్రలో చెప్పిస్తారు. కానీ వేరే వారికి సంబంధించిన అంశాల మీద తన అభిప్రాయాలు చెప్పొచ్చు. కానీ అవి కరెక్టు అవ్వోచ్చు.. కాకపోవచ్చు. అదే జరుగుతుందని మాత్రం చెప్పలేరు. కానీ సోమిరెడ్డి చెప్పిన తీరు అలానే ఉందనే టాక్‌ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంటే.. సోమిరెడ్డి సోషల్‌ మీడియాలో స్పందించిన తీరును ఆయన అభిమానులు తెగ లైక్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News