చాలా ఏళ్ల తర్వాత కోర్టు ముందుకు జగన్
వ్యక్తిగతంగా నవంబరు 21 లోపు హాజరు కావాలని సీబీఐ కోర్టు జగన్ ను ఆదేశించింది.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సంవత్సరాల అనంతరం రేపు అంటే నవంబర్ 20 గురువారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు కానున్నారు. వ్యక్తిగతం హాజరు కావాలని కోర్టు స్పష్టం చేయడంతో కోర్టుకు హాజరు కావడం జగన్ కు తప్పనిసరైంది. సుదీర్ఘ కాలంగా జగన్ బెయిల్‌పై ఉన్నారు. 2019 ఎన్నికల అనంతంర అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టుకు హాజరు కాలేదు. జగన్ చివరి సారిగా ఈ కేసులో 2020 జనవరి 10 న కోర్టుకు హాజరయ్యారు.
కోర్టుకు హాజరుకు సంబంధించిన అంశంలో అధికార హోదాను ఆయుధంగా వాడుకున్నారనే ఆరోపణలు జగన్ పై ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో “భద్రతా కారణాలు, పరిపాలనా బాధ్యతలు” అంటూ పిటిషన్ దాఖలు చేసి కోర్టు నుంచి మినహాయింపు పొందారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా కోర్టుకు హాజరు కాకుండా పలుమార్లు వాయిదాలు వేయించుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు జగన్ పైన ఉన్నాయి. అయితే ఇటీవల లండన్ పర్యటన కోర్టుకు హాజరయ్యే పరిస్థితులకు దారి తీసింది. జగన్ తన లండన్ పర్యటన సమయంలో తప్పుడు ఫోన్ నంబరు ఇచ్చారని, ఇది బెయిల్ షరతులు ఉల్లించినట్టు అని, దానికి సంబంధించిన ఆధారలను సీబీఐ కోర్టు ముందు ఉంచింది. కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లింఘించారని కోర్టు ముందుకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో కోర్టు స్పందించింది. వ్యక్తిగతంగా నవంబరు 21 లోపు కోర్టుకు హాజరు కావాలని జగన్ ను ఆదేశించింది.
అయితే మాజీ ముఖ్యమంత్రిగా తనకు భద్రతా కారణాల వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును జగన్ కోరారు. జగన్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు తప్పనిసరిగా హాజరు కావాలసిందే అని ఆదేశించింది. మరో వైపు ప్రస్తుతం జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. నిర్ణీత సంఖ్యలో కంటే వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువుగా ఉండటంతో ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో జగన్ కు మాజీ ముఖ్యమంత్రి హోదా తోపాటు వైసీపీ పార్టీ అధ్యక్షలుగా, పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఆయనకు హోదా ఉంది. ఈ క్రమంలో తనకు భద్రత సమస్య వల్ల కోర్టుకు రాలేనని చెప్పే అవకాశం లేకుండా పోయిందనే చర్చ కూడా ఉంది. ఈ క్రమంలో జగన్ ఆరేళ్ల తర్వాత కోర్టుకు ముందుకు రానుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే సీబీఐ కోర్టు ఎలా స్పందో అనేది ఆసక్తికరంగా మారింది.
కేసు నేపథ్యం
2011-12లో జగన్ అక్రమాస్తుల కేసు తెరపైకొచ్చింది. సీబీఐ దాఖలు చేసిన ఈ కేసులో మొత్తం 11 చార్జిషీట్లు, ఈడీ నుంచి 9 ప్రాసిక్యూషన్ కంప్లైంట్లు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2004-09 మధ్య కాలంలో క్విడ్‌ప్రోక్వో పెట్టుబడుల ద్వారా జగన్ సంస్థలకు అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారనేది ముఖ్య ఆరోపణ. ఈ కేసు విచారణ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. సుప్రీంకోర్టు కూడా ఈ ఆలస్యంపై ఇదివరకే అసంతృప్తి వ్యక్తం చేసింది.