వంగవీటి రంగా విగ్రహాలకు అవమానం, 2 చోట్ల టెన్షన్.. టెన్షన్

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఘాటుగా స్పందించారు.;

Update: 2025-08-23 09:05 GMT
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ప్రముఖ కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ వంగవీటి రంగా విగ్రహాలకు ఘోర అవమానం జరిగింది. కలిదిండి, సానా రుద్రవరం గ్రామాలలో రంగా విగ్రహాలకు పశువుల పేడ పూసి అవమానించారు. సానా రుద్రవరం కూడలిలోని విగ్రహానికైతే గంపలతో పేడ పోసినట్టు కనిపిస్తోంది. ఈ ఘటనలపై ఆ గ్రామాలలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

ఓ వర్గం ప్రజలైతే వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితుల అంతు చూస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. తీవ్ర దూషణ భూషణలతో సవాళ్లు విసురుతున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఘాటుగా స్పందించారు. ఇటువంటి ఘటనలు సమాజంలో అశాంతిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయే తప్ప ఎటువంటి ప్రయోజనం సాధించలేవని, నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, శాంతిభద్రతలను కాపాడాలని అధికారులను ఆదేశించారు.
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాసరావు కూడా తీవ్రంగా స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కలిదిండి గ్రామంలో రంగా విగ్రహానికి పేడ పూసిన తర్వాత ఆ పక్కనే ఉన్న సానా రుద్రవరంలో మరో విగ్రహాన్ని దుండగులు ఘోరంగా అవమానించారు.
సానా రుద్రవరం గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు కూడళ్లలోని వంగవీటి రంగా విగ్రహాలపై దుండగులు ఎవరో పేడ పోశారు. ఒక విగ్రహంపై గంపలతో తెచ్చి పేడ పోసినట్టు కనిపిస్తోంది. తెల్లవారి చూసే సరికి విగ్రహాలు పేడ మరకలతో కనిపించాయి. దీంతో ఆ గ్రామంలోని ఓ వర్గం వారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

పేడపూసిన విగ్రహాల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో అధికారులు రంగ ప్రవేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలోని కొన్ని స్పందనలు...
"నిజంగా మీరు పుట్టింది మగ పుట్టుక అయితే మీ ఇంట్లో చెప్పి రండిరా మా మీదకి...మీ రక్తంతో ఆయన విగ్రహాలకి అభిషేకం చేయకపోతే ఆయన భక్తులమే కాదు మేము కొ...రా 😡⚔️.." 
"ఇంత అవమానం కూడా మనం నిలబడకపోతే ఇక అనవసరం. ఇది జరిగిన ఊరిలో కొడితే తెలుగు రాష్ట్రాలు రెండు వణికిపోవాలి. ఇంకో సారి ఇటువంటి నీతిమాలిన పనీ చెయ్యాలి అంటే వణికిపోవాలి. JOHAR VANGAVEETI MOHAN RANGA GARU 🔥"
"చుట్టూ పక్కల ఒక్క సీసీ కెమెరా కూడా లేదా.. ఏదో రోడ్ లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న క్లూ అయినా ఉంటుంది. చూడండి.. నెంబర్ ప్లేట్ లేని బండి, మొహానికి ముసుగు, టైం కానీ టైం బండి వెళ్లే స్పీడ్, అనుమానం ఉన్న వ్యక్తులు ఒకసారి చెక్ చేస్తే ఏదో ఒక క్లూ ఉంటుంది.."
"చనిపోయిన వారికి గౌరవం ఇవ్వకున్నా పరవాలేదు కానీ పెద్దాయన్ని😢 అలా అవమానం చేయకండి"
"నీతి జాతి లేనీ కొడుకులంటూ"
ఇలా... వేలల్లో సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. వాటిని చంద్రబాబు, లోకేశ్ కి ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించింది.
Tags:    

Similar News