ఇండియా మాత్రమే యువ దేశం, మిగతావన్నీ 'ముసలి' దేశాలే!
“భవిష్యత్తు భిన్నంగా ఉంటుంది. ప్రపంచ సమాజానికి సేవలు అందించగలిగేది భారత్ మాత్రమే,” అంటున్నారు చంద్రబాబు.
By : The Federal
Update: 2025-09-22 10:59 GMT
ప్రపంచ దేశాలన్నింటా ఇండియా మాత్రమే యువ దేశమని, భవిష్యత్తు పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ సమాజానికి అవసరమైన సేవలు అందించగలిగేది భారత్ ఒక్కటేనని చెప్పారు.
విశాఖపట్నం పోర్టు సిటీలో సోమవారం ప్రారంభమైన జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ఆయన ప్రసంగించారు. యూరప్, జపాన్ వంటి పలు దేశాలు వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటున్నాయని, టెక్నాలజీ ఉన్నా దాన్ని వినియోగించే మనుషులు లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు.
“భవిష్యత్తు భిన్నంగా ఉంటుంది. ప్రపంచ సమాజానికి సేవలు అందించగలిగేది భారత్ మాత్రమే,” అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైద్యులు, నర్సులు, టెక్నాలజీని వినియోగించగలిగే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత పలు దేశాల్లో తీవ్రంగా ఉందని వివరించారు.
అయితే భారత్‌కు పరిస్థితి పూర్తిగా భిన్నమని, దక్షిణాసియా దిగ్గజానికి ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా — 143 కోట్లు — ఉందని చెప్పారు. ఇది భారత్‌కు ఒక భారీ మార్కెట్ అవకాశమని అభివర్ణించారు. చైనాలో జనాభా “కేవలం 130 కోట్లు మాత్రమే” అని ఆయన పోల్చిచెప్పారు.
ప్రపంచంలోని కొన్ని దేశాలు తమ జనాభాలో అధిక వయసు సమస్య తో సతమతమవుతున్నాయి. కానీ భారతదేశం మాత్రం డెమోగ్రాఫిక్ డి విడెండ్ ( పని చేసే వయసున్న వారు అధికంగా ) దేశంగా ఉంది. ఇది మన దేశానికి ఎంతగానో కలిసోచ్ఛే అంశం. సాంకేతిక రంగానికి ఇది ఎంతో ప్రయోజన కరంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.