దేవాలయాలకు వెళ్ళి రావడమే గతంలో పర్యాటకం
ఏపీలో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు కు అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.
గతంలో పర్యాటకం అంటే దేవాలయాలకు వెళ్ళి రావడమే కానీ ఇప్పుడు టూరిజం దేశాల ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలన్న లక్ష్యం తో టూరిజం డే నిర్వహించుకుంటున్నామన్నారు. 2.6 ట్రిలియన్ డాలర్లు ఆదాయం పర్యాటకం పై ఆయా దేశాలకు వస్తోందన్నారు. వాటితో పోలిస్తే భారత్ లో పర్యాటక రంగానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక హోదా కల్పించామన్నారు. పర్యాటకం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని, ఉపాధిని, ఉద్యోగాలను సాధించే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం ఒక్క ఇజమే నిలిచి ఉంటుంది. అది టూరిజం మాత్రమే అన్నారు. పర్యాటకం కోసం భారతీయులు ఇతర దేశాలకు వెళుతున్నారు. కానీ మనకు ఉన్నన్ని పర్యాటక ప్రదేశాలు ఇంక ఎక్కడా లేవు. ఏపీలో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు కు అపారమైన అవకాశాలు ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం లో అనుమతులు, ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఇవాళ స్వదేశీ 4 జీ నెట్ అందుబాటులోకి వచ్చింన్నారు. 10,600 కోట్ల పెట్టుబడులు పర్యాటక రంగంలో ఏపీ కి వచ్చాయి. అరకు, పాడేరు, విశాఖ, తిరుపతి, రాయల సీమ తదితర ప్రాంతాల్లో 10 వేల హోం స్టే లు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే మూడేళ్ల లో 50 వేల హోటల్ రూం లను కూడా అందుబాటులోకి తెస్తాం. మన సంస్కృతి సంప్రదాయలనూ ఉపయోగించుకుని ఎక్సీ్పరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.