అమరావతిలో ఎకరం కిరాయి రూపాయి!
కొత్తగా 11 సంస్థలకు 49.50 ఎకరాలు
By : The Federal
Update: 2025-11-18 04:30 GMT
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రముఖ సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. అమరావతిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఏడాదికి ఎకరానికి రూపాయి కిరాయి చొప్పున వీటిని కేటాయించింది.
కొత్తగా భూములు వాటిలో 11 సంస్థలు ఉన్నాయి. పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
ఏయే సంస్థలకు ఇచ్చారంటే..
సిఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్‌కు 15 ఎకరాలు. 60 ఏళ్ల లీజుకు. ఎకరం 4.1 కోట్ల ప్రీమియం, ఎకరానికి ఒక రూపాయి అద్దె.
కాగ్‌కు 12 ఎకరాల భూమి. ఎకరా రూ.4.1 కోట్లకు కేటాయింపు
ఎన్‌టిపిసికి 1.50 ఎకరాలు, ఎకరం 4.1 కోట్ల ప్రీమియం కింద ఎకరానికి ఒక రూపాయి అద్దె
జ్యుడీషియల్ అకాడమీకి 5 ఎకరాలు. 60 ఏళ్లకు ఎకరానికి రూపాయి అద్దె.
నేషనల్ కనస్ట్రక్షన్ అకాడమీకి 5 ఎకరాలు,
బాసిల్ ఉడ్ ఇంటర్నేషన్ స్కూల్‌కు 4 ఎకరాలు. ఎకరా రూ.50 లక్షల చొప్పున ఫ్రీ హోల్డ్ పద్ధతిలో కేటాయింపు.
శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్‌కు 7.97 ఎకరాలు. ఎకరా రూ.50 లక్షల చొప్పున ఫ్రీహోల్డ్ పద్ధతిలో...
బ్యాంకులకు కూడా...
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు 40 సెంట్లు,
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 40 సెంట్లు,
ఐబిఐడికి 40 సెంట్లు కేటాయించారు. ఎకరం 4.1 కోట్ల ప్రీమియం కింద ఎకరానికి ఒక రూపాయి అద్దె నిర్ణయించారు. మొత్తం 49.50 ఎకరాలు కొత్తగా కేటాయింపులు జరిపారు.
6 సంస్థలకు గతంలో కేటాయించిన 42.30 ఎకరాలకు స్వల్ప మార్పులు చేశారు. వీటిల్లో ఇండస్ ఇంటర్నేషనల్ అకాడమీకి 8 ఎకరాలు ఎకరం రూ.50 లక్షలు చొప్పున ప్రీహోల్డ్ పద్ధతిలో కేటాయించారు.
బిపిసిఎల్‌కు గతంలో 40 సెంట్లు కేటాయించగా దాన్ని 1.34 సెంట్లకు పెంచారు. నామినల్ అద్దెకు 60 ఏళ్లకు ఇచ్చారు.
ఐఆర్‌సిటిసికి గతంలో ఎకరం కేటాయించగా దాన్ని రెండు ఎకరాలు పెంచారు.
ఎపిహెచ్‌ఆర్‌డిఐకి గతంలో 24.94 ఎకరాలు ఇవ్వగా ప్రస్తుతం 10 ఎకరాలకు తగ్గించారు.
గ్జేవియర్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు గతంలో 50 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం మరో 11.79 ఎకరాలు అదనంగా కేటాయించి ఎకరం రూ.50 లక్షలు చొప్పున ఫ్రీహోల్డ్ కింద ఇచ్చారు.
హడ్కోకు గతంలో 8 ఎకరాలు ఇచ్చి ప్రస్తుతం మరో 1.17 ఎకరాలు కలిపారు. ఎకరం నాలుగు కోట్లు చొప్పున ఫ్రీహోల్డ్‌లో ఇవ్వాలని నిర్ణయించారు.
పలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇళ్ల స్థలాల కోసం 12.66 ఎకరాల కేటాయింపుల్లో మార్పులు చేర్పులు జరిపారు.
గతంలో ఆప్కాబ్‌కు 2.60 ఎకరాలు కేటాయించగా దాన్ని 2.20 ఎకరాలకు తగ్గించారు. ఎస్‌బిఐకి గతంలో 50 సెంట్లు ఇచ్చారు. దాన్ని 2.05 ఎకరాలు పెంచారు.
ఆర్‌బిఐకి గతంలో ఆరు ఎకరాలు ఇచ్చి ఇప్పుడు 4.04 ఎకరాలకు పెంచారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు 1.15 ఎకరాలు, కెనరా బ్యాంకుకు గతంలో 1.50 ఎకరాలు ఇచ్చి దాన్ని 80 సెంట్లకు కుదించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గతంలో రెండు ఎకరాలు ఇచ్చారు, దాన్ని 80 సెంట్లకు తగ్గించారు.
బిపిసిఎల్‌కు 1.10 ఎకరాలు(గతంలో 2ఎకరాలు), ఎన్‌ఐఎసిఎల్‌కు గతంలో ఏడు ఎకరాలు ఇచ్చి ఇప్పుడు 50 సెంట్లకు కుదించారు. ఈ భూములన్నీ కూడా ఎకరం 4.1 కోట్ల ప్రీమియం కింద ఎకరానికి ఒక రూపాయి అద్దె కేటాయించారు.
డీఏవీ స్కూలు స్థలం మార్పు..
అమరావతిలో 2014-19 మధ్య భూములు కేటాయించిన పలు సంస్థలకు మార్పులు చేశారు. గతంతో డిఏవి స్కూల్‌కు అబ్బురాజుపాలెంలో మూడు ఎకరాలు ఎకరం రూ.50 లక్షల చొప్పున ఫ్రీహోల్డ్‌లో ఇచ్చారు. దాన్ని నెక్కల్లుకు మార్చారు. ఎఫ్‌సిఐకి అనంతవరంలో 50సెంట్లు, వెలగపూడిలో 60 సెంట్లు ఇచ్చారు. వాటిని నేలపాడు, ఐవనవోలుకు మార్చారు. ఎకరం నాలుగు కోట్లు చొప్పున ఇవ్వనున్నారు.
కాంథారి హోటల్స్‌కు తుళ్లూరులో ఎకరం భూమిని(సర్వే 185) రూ.1.50 కోట్లు చొప్పున ఫ్రీహోల్డ్‌లో కేటాయించారు.
కినారా(స్వాగత హోటల్స్)కు మందడంలో 1జ50 ఎకరాల భూమిని ఎకరం రూ.1.50 కోట్లకు ఫ్రీహోల్డ్ పద్ధతిలో ఇచ్చారు. పబ్లిక్ లైబ్రరీ డిపార్టుమెంటుకు గతంలో ఎకరం ఇచ్చి దాన్ని 6.19 ఎకరాలకు పెంచారు. జిఐఐ స్కూల్‌కు ఎకరం 50 లక్షల చొప్పున నాలుగు ఎకరాలు ఇచ్చారు. ఇదే సంస్థలకు గతంలో మొత్తంగా 13.1 ఎకరాలు కేటాయించగా కొత్తగా మార్పుల్లో అది 16.19 ఎకరాలకు పెరిగింది.