తప్పు చేస్తే చంద్రబాబు నన్నూ జైలుకు పంపుతారు
2029 తర్వాత కూడా ఎన్డీఏ కూటమితో తమ పొత్తు కొనసాగుతుందని మంత్రి లోకేష్ చెప్పారు.;
ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రతీ కార చర్యలకు తాము పాల్పడటం లేదని ఒక వేళ తాను చట్టాన్ని ఉల్లంఘించి తప్పు చేస్తే తనను కూడా సీఎం చంద్రబాబు జైలుకు పంపేందుకు వెనుకాడరని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్ మీద, వైసీపీ శ్రేణుల మీద, అధికారుల మీద కక్షపూర్తి రాజకీయాలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న ఆయన కోయంబత్తూరులో ఇండియా టుడే నిర్వహించిన సౌత్ కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన బిల్లును సమర్థిస్తున్నట్లు చెప్పారు. భారత దేశంలో క్లీన్ పాలిటిక్స్ చాలా అవసరమన్నారు. రాజకీయ నాయకులకు సంబందించిన కేసుల్లో ఏడాది లోపు తీర్పులు వెలువడాలన్నారు. కానీ మన దేశంలో అలా జరగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు మిస్ యూజ్ కాదనే నమ్మకం తనకుందన్నారు.